సోనియాకు జీవితాంతం రుణపడి ఉంటాను: కేసీఆర్
హైదరాబాద్: సోనియా గాంధీకి జీవితాంతం రుణపడి ఉంటానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణభవన్ లో ఏర్పాటు నిర్వహించిన పోలిట్ బ్యూరో సమావేశమనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలుంటే యూపీఏకు మద్దతిస్తానని కేసీఆర్ తెలిపారు. సోనియాగాంధీ చొరవ చూపడం కారణంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత సోనియాగాంధీని కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలుసుకున్న సంగతి తెలిసిందే. ఆతర్వాత టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కేసీఆర్ అయిష్టత చూపిన తర్వాత ఇరుపార్టీల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ ప్రధాని అయ్యే అవకాశం ఉంటే మద్దతిస్తానని కేసీఆర్ చెప్పడం చర్చనీయాంశమైంది.