- ప్రధాని మోదీపై పొన్నం ధ్వజం
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా, పాలనను గాలికొదిలేసి ప్రధాని నరేంద్ర మోదీ విదేశాలు తిరుగుతున్నారని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. విదేశీ వ్యవహారాల మంత్రిని పక్కకు పెట్టి మరీ విదేశాలు తిరుగుతున్నారని, ఇందుకే మోదీ ప్రధాని అయినట్టుందని శుక్రవారం ఎద్దేవా చేశారు. జన్‌ధన్ యోజన, స్వచ్ఛ భారత్ తప్ప ఈ ఏడాది కాలంలో ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా ఆయన చేయలేదని విమర్శించారు. భూసేకరణ చట్టంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.