మానకొండూర్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రయోగించిన బుల్లెట్ కేసీఆర్ అని, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న ఆయన్ను నమ్మవద్దని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిం చకుండా, మంత్రివర్గ విస్తరణ చేయకుండా ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజా సమస్యలను గాలికొదిలి ఫెడరల్ ఫ్రంట్ పేరు తో రాష్ట్రాలు తిరుగుతున్నారన్నారు. 2006లోనే ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన ఉన్నప్పుడు 2014 నుంచి 2018 వరకూ అధికారంలో ఉండి ఎందుకు తిరుగుతున్నారని పొన్నం ప్రశ్నించారు. ఆయా రాష్ట్రాల్లోని ప్రాం తీయ పార్టీలను కలుపుకొని ఎందుకు ముందుకు వెళ్లలేకపోయాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మోదీని కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిం చారు. బీజేపీ నియంతృత్వ పాలనను అంతమొందించడానికి కాంగ్రెస్ కూటమి ఏర్పడటంతోనే ఫెడరల్ ఫ్రంట్ పేరిట బీజేపీ బీ–టీంను ముందుకు తెచ్చిం దని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment