సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మల్లన్న సాగర్‌కు వచ్చిన నీళ్లు కాళేశ్వరం వాటరా? లేక ఎల్లంపల్లి నీళ్లా? అనేది హరీష్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఇరిగేషన్ మాజీ మంత్రిగా హరీష్.. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వొచ్చు అంటూ కామెంట్స్ చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే హరీష్ రావు హార్డ్ వర్కర్, ఆయనకు కష్టపడేతత్వం ఉంది. అబద్దాలతో ప్రజలను మేనేజ్ చేస్తామంటే కుదరదు. రాజకీయం చేయడం మా ప్రాధాన్యత కాదు. రైతులకు నీళ్లు ఇవ్వడమే మాకు ముఖ్యం. హరీష్ ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలి. మలన్నసాగర్‌కు వచ్చిన నీళ్లు ఎక్కడివి?. ప్రభుత్వం తరఫున హరీష్ రావును అడుగుతున్నాను. నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి. కాళేశ్వరం నీళ్లా? ఎల్లంపల్లి వాటరా?.
బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టాన్ని మేనేజ్ చేసేందుకు హరీష్ ప్రయత్నం చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రిగా ప్రభుత్వానికి ఆయన సలహాలు ఇవ్వొచ్చు. సూచనలు కూడా చేయవచ్చు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే పూర్తి అయ్యింది. ఎల్లంపల్లి ప్రారంభోత్సవానికి వస్తానని కిరణ్ కుమార్ రెడ్డి అంటే.. హెలికాప్టర్ పేల్చేస్తానని చెప్పాను. ఇంజనీర్ కాని ఇంజనీర్ కేసీఆర్ నిర్వాకం వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనిరాకుండా పోయింది. కేసీఆర్ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ధ్వంసానికి కుట్ర జరిగిందని ఆనాటి అధికారులు చెప్పారు. కేసీఆర్ పాలనలోనే కాళేశ్వరం కుంగిపోయి నిష్ప్రయోజనంగా మారింది’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: జానీ భార్య అయేషా అరెస్ట్‌కు రంగం సిద్ధం?
Comments
Please login to add a commentAdd a comment