జిల్లాలోని సమగ్ర నీటి పథకానికి రూ.700 కోట్లు మంజూరు చేయకుంటే కరీం నగర్ నుంచి హైదరాబాద్‌కు తీసుకుపోయే తాగునీటి సరఫరాను అడ్డుకుంటామని ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.
హుస్నాబాద్‌రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలోని సమగ్ర నీటి పథకానికి రూ.700 కోట్లు మంజూరు చేయకుంటే కరీం నగర్ నుంచి హైదరాబాద్‌కు తీసుకుపోయే తాగునీటి సరఫరాను అడ్డుకుంటామని ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. జిల్లా నీటి అవసరాలను తీర్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాలన్నారు. గురువారం స్థాని కంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్ డ్యాం నీరు ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడడం లేద ని, ఇక్కడి నీటిని సిద్దిపేటకు తరలించుకుపోతున్నారని అన్నారు. జిల్లా ప్రజలు ఆ సమయంలో గగ్గోలు పెట్టినా నాటి ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని చెప్పారు.
ప్రస్తుతం మరోసారి ప్రజల నుంచి విమర్శలను ఎదుర్కోదలుచుకోలేదన్నారు. జిల్లాకు చెందిన రూ.700 కోట్ల నిధుల మంజూరు హామీని నెరవేర్చాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య, జిల్లా మంత్రి శ్రీధర్‌బాబుకు నివేదికను అందించామన్నారు. ఈ నిధులు మంజూరైతే సింగిల్, మల్టీ విలేజ్, సీపీడబ్ల్యూఎస్, 24 గంటలు విద్యుత్ సౌకర్యం ఉన్న గ్రామాలకు తాగునీటి సరఫరా అందించవచ్చన్నారు. ఇక్కడి తాగునీటి ప్రాజెక్టుకు నిధు లు మంజూరు చేయకుంటే హైదరాబాద్‌కు సరఫరాను అడ్డుకుని తీరుతామన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే అల్గిరె డ్డి ప్రవీణ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మట్టారాజిరెడ్డి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యాల సంజీ వరెడ్డి, నాయకులు చిత్తారి రవీందర్, వెంకటరమణ, సత్యనారాయణ, వాల నవీన్, గడిపె సింగరి తదితరులు ఉన్నారు.