'ప్రేమలేఖ’పై రేపు మాట్లాడతా.. | i will speak tomorrow on 'love letter', says kiran kumar reddy | Sakshi
Sakshi News home page

'ప్రేమలేఖ’పై రేపు మాట్లాడతా..

Published Sat, Jan 4 2014 2:14 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

'ప్రేమలేఖ’పై రేపు మాట్లాడతా.. - Sakshi

'ప్రేమలేఖ’పై రేపు మాట్లాడతా..

శ్రీధర్‌బాబు రాజీనామాపై సీఎం వ్యాఖ్య


 సాక్షి, హైదరాబాద్: శాసనసభా వ్యవహారాల శాఖ నుంచి తప్పించినందుకు మంత్రి శ్రీధర్‌బాబు తన పదవికి రాజీనామా చేయడంపై శనివారం వివరంగా మాట్లాడతానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం అసెంబ్లీ ముగిసిన తరువాత తన చాంబర్ నుంచి బయటకు వచ్చిన సీఎం అక్కడే వేచి ఉన్న మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు రాజీనామా అందిందా? అని విలేకరులు అడగ్గా.. ‘‘ శ్రీధర్‌బాబు ప్రేమలేఖనా? దానిపై రేపు (శనివారం) మాట్లాడుతానులెండి’’ అంటూ వ్యాఖ్యానించారు. శాఖల మార్పు వివాదమై బౌన్సర్లు మీ మీదే వచ్చి పడుతున్నట్లుగా ఉంది కదా? అని అడిగితే ‘‘ఏమిటో ఈ క్రికెట్ భాష. నాకేమీ అర్థం కావడం లేదు. రేపు అన్నిటిపై మాట్లాడుకుందాం’’ అంటూ వెళ్లిపోయారు.


 శ్రీధర్‌బాబు రాజీనామా అందలేదు: గవర్నర్


 తిరుపతి: మంత్రి శ్రీధర్‌బాబు రాజీనామా తనకు చేరలేదని గవర్నర్ నరసింహన్ తెలిపారు. లేఖ అందాక ఆమోదంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తిరుమల పర్యటన ముగించుకుని శుక్రవారం హైదరాబాద్ వెళుతూ రేణిగుంట విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement