సాక్షి,హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా సెక్రటేరియట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించనుంది.
ప్రభుత్వం తరపున ఆహ్వాన ప్రతికను అందించేందుకు ఇప్పటికే కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్‌తో పాటు బీజేపీ కేంద్ర మంత్రులు ప్రభుత్వం తరపున ఆహ్వానాన్ని అందించేందుకు వారి సమయం కోరినట్లు మంత్రి పొన్నం చెప్పారు.
కాగా,సెక్రటేరియట్‌లో తెలంగాణతల్లి విగ్రహ ఏర్పాటు స్థలంపై బీఆర్‌ఎస్ తొలినుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చోట తెలంగాణతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణతల్లి విగ్రహంలో చేసిన మార్పులపైనా బీఆర్‌ఎస్ గుర్రుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment