బెంగళూరు: సంచలనం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. సెక్స్ స్కాండల్ వెలుగు చూసిన తర్వాత కూడా జేడీఎస్‌తో బీజేపీ ఇంకా ఎందుకు పొత్తులో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవణ్ణపై కర్ణాటక ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశ్నపై డీకే మండిపడ్డారు. ‘జేడీఎస్ కాంగ్రెస్‌తో పొత్తులో లేదు. బీజేపీ పొత్తులో ఉందో లేదో అమిత్ షా చెప్పాలి’అని డీకే డిమాండ్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల గురించి అతని డ్రైవర్ కార్తిక్ గౌడ తొలుత బీజేపీ నేతలకే సమాచారమిచ్చాడన్నారు.
Comments
Please login to add a commentAdd a comment