
ఇటలీకి చెందిన బెన్ యాక్టిస్ అనే అతను ఎక్కువగా సిస్టమ్‌తో గడుపుతుండేసరికి అతని బామ్మ అతన్ని ‘ఏముంటుంది అందులో’ అని విసుక్కునేది. దాంతో బెన్ ఆ ఎనభై ఐదేళ్ల బామ్మగారికి సిస్టమ్ ఎలా పని చేస్తుందో చూపించాలనుకున్నాడు. ఆమెను దగ్గర కూర్చోబెట్టుకుని గూగుల్ ఇటీవలే ప్రవేశపెట్టిన స్మార్ట్ స్పీకర్స్ సహకారంతో బామ్మగారిని ‘నువ్వు దానిని కొన్ని ప్రశ్నలు అడుగు, అది సమాధానం చెబుతుంది’ అని వాతావరణానికి సంబంధించినవి, ఇంకా కొన్ని జనరల్ ప్రశ్నలు కూడా అడిగించాడు.
అపనమ్మకంగానే బామ్మగారు దాన్ని ప్రశ్నలడిగింది. అడిగిన వాటన్నిటికీ అటువైపు నుంచి ఠపీమని సమాధానాలు వస్తుండేసరికి ముందు ఉలిక్కిపడింది బామ్మ. గూగుల్ అని పలకడం కూడా సరిగా రాని బామ్మ, గూ గూ అని మాట్లాడింది దానితో. అది సమాధానాలు ఇవ్వడం చూసి ముచ్చట పడిపోయింది. బామ్మగారి ఆసక్తిని గమనించిన మనవడు ఆమెకు క్రిస్మస్ కానుకగా గూగుల్ హోమ్ కొనిపెట్టి మురిసిపోయాడు. ఈ బామ్మా మనవళ్ల వీడియోను చూసిన వాళ్లంతా కూడా ముచ్చటపడిపోయారు.