సత్యం రాజేష్‌ హీరోగా ‘టెనెంట్‌’.. రిలీజ్‌ అప్పుడేనా? | Satyam Rajesh Tenant Movie Latest Update | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ 'టెనెంట్’..రిలీజ్‌కు రెడీ

Published Tue, Mar 19 2024 8:31 PM | Last Updated on Tue, Mar 19 2024 8:32 PM

Satyam Rajesh Tenant Movie Latest Update - Sakshi

'పొలిమేర2' బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ 'టెనెంట్'. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. 

ప్రజెంట్ జనరేషన్ లో మహిళలు ఎంత అప్రమంతంగా ఉండాలో తెలియజేసేలా చాలా విలువైన కంటెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ మూడో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement