
రవితేజ, శ్రుతీహాసన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్’. మలినేని గోíపీచంద్ దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్ డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్నారు. గత వారం ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో ‘క్రాక్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సోమవారం ‘క్రాక్’ చిత్రబృందం ఒక వర్కింగ్ వీడియోను విడుదల చేసింది. ‘స్టేషన్‌లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టి....’ అని రవితేజ చెప్పే డైలాగ్ సీన్‌ను ఈ వీడియోలో చూడొచ్చు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లు, మాస్ ఎలిమెంట్స్‌తో కనిపించిన టీజర్‌కు చక్కని స్పందన వచ్చిందన్నారు నిర్మాత. వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని, సుధాకర్ కొమాకుల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్.
Comments
Please login to add a commentAdd a comment