![Neha Shetty reacts Trolls, comments on social media - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/5/neha-shetty-dj-tillu.jpg.webp?itok=ICKE3N9o)
నేహా శెట్టి
‘‘డిజె టిల్లు’ ట్రైలర్ చూసి రొమాంటిక్ ఫిల్మ్ అనుకుంటారు. కానీ ఇందులో కామెడీ, థ్రిల్, ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్ వంటి వాణిజ్య అంశాలున్నాయి’’ అన్నారు నేహా శెట్టి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్‌గా విమల్‌కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘డిజె టిల్లు’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నేహా శెట్టి మాట్లాడుతూ– ‘‘మలయాళంలో ‘ముంగార మళే 2’ చిత్రంలో హీరోయిన్‌గా చేశాను.
తెలుగులో పూరి జగన్నాథ్‌గారు ‘మెహబూబా’ చిత్రంతో తొలి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ‘గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రాల్లోనూ నటించాను. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి పెద్ద సంస్థలో ‘డిజె టిల్లు’ చేసే అవకాశం రావడం నా లక్. ఈ సినిమాలో నిజాయతీగా, ఆత్మవిశ్వాసంతో ఉండే రాధిక అనే అమ్మాయి పాత్ర చేశాను. ఈ మూవీలో తెలంగాణ యాసలో చేయడం కొత్తగా అనిపించింది. కరోనా వల్ల మనమంతా ఒత్తిడికి గురయ్యాం. ‘డిజె టిల్లు’ చూస్తే ఆ ఒత్తిడినంతా మర్చిపోతారు. సోషల్ మీడియాలో ట్రోల్స్, కామెంట్స్ వస్తుంటాయి. అయితే ఆ విమర్శలను పట్టించుకోను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment