అనిరుధ్‌ గాత్రంతో మరో స్థాయిలో పటాస్‌ పిల్లా సాంగ్‌! | DJ Tillu: Pataas Pilla Full song Out Now | Sakshi
Sakshi News home page

DJ Tillu: డీజే టిల్లు నుంచి పటాస్‌ పిల్లా సాంగ్‌.. విన్నారా?

Published Mon, Jan 24 2022 12:35 PM | Last Updated on Mon, Jan 24 2022 4:44 PM

DJ Tillu: Pataas Pilla Full song Out Now - Sakshi

శ్రీ చరణ్‌కి దాదాపు ముప్పై పాటల వరకూ రాసి ఉన్నాను. అతనితో పని ఎలా ఉంటుందో తెలిసిన అనుభవం వల్ల ఇంకాస్త త్వరగా పాట పూర్తయ్యింది. ఈ కష్టానికి అనిరుధ్ గొంతు తోడైతే

"లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల" గాయకుడు రామ్ మిరియాల స్వయంగా ఆలపిస్తూ, స్వరాలు సమకూర్చిన ఈ గీతం చార్ట్ బస్టర్‌లో దూసుకు వెళుతున్న నేపథ్యంలో డీజే టిల్లు సినిమా నుంచి మరో గీతం సోమవారం(జనవరి 24న) విడుదల అయింది. "రాజ రాజ ఐటం రాజ.. రోజ రోజ క్రేజీ రోజ.. పటాస్ పిల్ల పటాస్ పిల్ల" అంటూ మొదలయ్యే ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించగా, శ్రీచరణ్ పాకాల స్వరాలను సమకూర్చారు. అనిరుధ్‌ రవిచందర్‌ అద్భుతంగా ఆలపించారు.

గీత రచయిత కిట్టు విస్సా ప్రగడ మాట్లాడుతూ...‘శ్రీ చరణ్ ముందు పల్లవి వరకు ట్యూన్ పంపారు. అది విన్నప్పుడు హుక్ లైన్ దగ్గర ‘పటాసు పిల్లా‘ అనే పదం తట్టింది. అదే మాట దర్శకుడితో పాటూ అందరికీ నచ్చింది. తర్వాత పాట సందర్భం తెలుసుకుని దాని చుట్టూ పాట అల్లుకుంటూ వచ్చాను.  పాటలో ఎలాంటి సన్నివేశాలు ఉంటాయో విమల్ నాకు చాలా వివరంగా కళ్ళకి కట్టినట్టు రాసి పంపారు. దాని వల్ల కొత్త రకం పోలికలు వాడటం సాధ్యపడింది. నేను శ్రీ చరణ్‌కి దాదాపు ముప్పై పాటల వరకూ రాసి ఉన్నాను. అతనితో పని ఎలా ఉంటుందో తెలిసిన అనుభవం వల్ల ఇంకాస్త త్వరగా పాట పూర్తయ్యింది. ఈ కష్టానికి అనిరుధ్ గొంతు తోడైతే పాట మరో స్థాయికి వెళ్తుందని నమ్మకం కలిగింది' అన్నారు.

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న డీజే టిల్లు సినిమాకు విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా 'సితార ఎంటర్టైన్ మెంట్స్', ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలసి నిర్మిస్తోంది. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement