DJ Tillu Actress Neha Shetty Emotional Tweet For Fans Over Movie Success - Sakshi
Sakshi News home page

Neha Shetty: డీజే టిల్లు హీరోయిన్‌ నేహాశెట్టి ఎమోషనల్‌ పోస్ట్‌

Published Sun, Mar 13 2022 2:58 PM | Last Updated on Sun, Mar 13 2022 3:48 PM

DJ Tillu Heroine Neha Shetty Emotional Tweet For Fans - Sakshi

DJ Tillu Heroine Neha Shetty Emotional Tweet: యంగ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రం​ 'డీజే టిల్లు'. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా విజయవంతమైన సంగతి తెలిసిందే. సిద్దు, నేహా శెట్టిల నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇదివరకే  మెహబూబా, గల్లీరౌడీ వంటి సినిమాల్లో నటించినా నేహా శెట్టికి ఈ సినిమాతోనే గుర్తింపు దక్కింది.

ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్‌ చేసింది. రాధికను టిల్లు నమ్మలేదు. కానీ మీరు(ప్రేక్షకులు) నమ్మారు. రాధికను అంగీకరించారు. రాధిక మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుం‍ది. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్‌ చేసినందుకు ధన్యవాదాలు అంటూ నేహా ట్వీట్‌ చేసింది. కాగా ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా రూ. 16.77కోట్లు వసూలు చేసి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement