సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం 'డీజే టిల్లు'. ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సక్సెస్ దిశగా పరుగులు పెడుతోంది. అయితే ఈ ఆనందాన్ని ఆస్వాదించేలోపే నేహా శెట్టి ఇంట విషాదం చోటు చేసుకుంది. డీజే టిల్లు రిలీజ్ అవడానికి రెండు రోజుల ముందు ఆమె నానమ్మ మృతి చెందింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన హీరోయిన్ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది.
'నా అభిమాని, చీర్ లీడర్ నన్ను వదిలి వెళ్లిపోయింది. నేను రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచే నా పర్ఫామెన్స్ చూసేందుకు అవ్వ ఎప్పుడూ ముందు వరుసలో కూర్చునేది. అలాంటి అవ్వ.. ఇప్పుడు నా విజయంలో, సంతోషంలో పాలు పంచుకునేందుకు ఇక్కడ లేరని తలుచుకుంటేనే నా హృదయం ముక్కలవుతోంది. కానీ ఆమె ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నాతోటే ఉంటాయి. ఐ లవ్ యూ అవ్వా, డీజే టిల్లు విజయాన్ని నీకు అంకితం ఇస్తున్నా.. డీజే టిల్లును బ్లాక్‌బస్టర్ హిట్ చేసిన అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా అవ్వతో దిగిన ఫొటోలను సైతం షేర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment