DJ Tillu Movie Twitter Review: Siddhu Jonnalagadda DJ Tillu Movie Twitter Review In Telugu - Sakshi
Sakshi News home page

DJ Tillu Twitter Review: డీజే టిల్లు ట్విటర్‌ రివ్యూ, ఎలా ఉందంటే?

Published Sat, Feb 12 2022 9:11 AM | Last Updated on Sat, Feb 12 2022 1:23 PM

Siddhu Jonnalagadda DJ Tillu Movie Twitter Review In Telugu - Sakshi

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా విమల్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డీజే టిల్లు’. దర్శకుడు కథ రాస్తే సిద్ధు డైలాగ్స్‌ రాశాడు. స్క్రిప్టు విషయంలో సలహాలిచ్చిన త్రివిక్రమ్‌ ఈ సినిమా హిట్‌ అవుతుందని ముందే జోస్యం పలికాడు. ఇప్పటికే రిలీజైన పాటలు అందరినీ ఆకట్టుకోగా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పుట్టుమచ్చల వ్యవహారం సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం శనివారం (ఫిబ్రవరి 12న) విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్స్‌ చూసిన ప్రేక్షకులు సినిమా ఎలా ఉందన్నదానిపై సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరి డీజే టిల్లు బాక్సాఫీస్‌లో సౌండ్‌ మోగిస్తున్నాడా? లేదా? అనేది నెటిజన్ల మాటల్లోనే చూద్దాం..

ఫస్టాఫ్‌ అదిరిపోయిందంటున్నారు మెజారిటీ నెటిజన్లు. ఎంటర్‌టైన్‌మెంట్‌ పీక్స్‌లో ఉందని, హీరోహీరోయిన్లు అద్భుతంగా నటించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. కాకపోతే సెకండాఫ్‌పై మాత్రం నెగెటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. ఫస్టాఫ్‌ మీద పెట్టిన దృష్టి రెండో భాగం మీద కూడా పెట్టాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఇంకాస్త ఎడిటింగ్‌ చేస్తే ఇంకో లెవల్‌లో ఉండేదని చెప్తున్నారు.

సినిమాను వన్‌మ్యాన్‌ షోలా నడిపించాడు సిద్ధు జొన్నలగడ్డ. తెలంగాణ యాసతో, పంచ్‌ డైలాగులతో యూత్‌కు బాగా కనెక్ట్‌ అవుతుంది సిద్ధు పాత్ర. ఇకపోతే సిద్ధు ఎనర్జీకి పోటీపడి నటించింది నేహా శెట్టి. ఈ సినిమాలో ఆమె నటకు మంచి మార్కులే పడ్డాయి.

కొద్ది మంది మాత్రం ఔట్‌ డేటెడ్‌ కామెడీ అని, టికెట్‌ డబ్బులు కూడా వృథానే అంటున్నారు. అయితే చాలాచోట్ల అడ్వాన్స్‌ బుకింగ్స్‌, పాజిటివ్‌ టాక్‌తో పర్వాలేదనిపిస్తోందీ మూవీ. ఇక సినిమా రిలీజ్‌ కాకముందే డీజే టిల్లు హిట్‌ అయితే సీక్వెల్‌ చేస్తామని ప్రకటించేసింది చిత్రయూనిట్‌. ప్రస్తుతానికైతే మిశ్రమ స్పందన అందుకుంటోంది సినిమా. మొత్తానికి పాజిటివ్‌ ఎనర్జీతో బరిలోకి దిగిన డీజే టిల్లును ఫన్‌ కోసం చూడొచ్చని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement