![Siddu Jonnalagadda Get Marriage With Star heroine - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/11/Siddu-Jonnalagadda.jpg.webp?itok=dtOT8_H2)
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన పెళ్లిళ్ల హడావిడి నడుస్తోంది. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా తమ పెళ్లి ప్రకటనలు ఇస్తూ అభిమానులను సంతోషపెడుతున్నారు. మరి కొందరు పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోయిన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది.
ఈ విషయంపై తాజాగా సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జోన్నలగడ్డ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. సిద్దు జొన్నలగడ్డ ఒక స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని.. వచ్చే ఏడాదిలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి అనే ప్రశ్నకు చైతన్య ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. 'స్టార్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు.. అదే స్టార్ హీరోని చేసుకుంటేనే ప్రాబ్లమ్ అవుతుంది కదా అని నవ్వేశాడు.' అతనకి కూడా పెళ్లి చేసుకోవాలని ఆసక్తి అయితే ఉంది. కానీ స్టార్ హీరోయిన్‌నే పెళ్లి చేసుకుంటాడో లేదో తనకు తెలియదని చెప్పారు. అన్నీ కుదురితే వచ్చే ఏడాది పెళ్లి కూడా జరగవచ్చని చెప్పారు.
(ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్, నటుడు సూర్యకిరణ్ ఇకలేరు!)
చైతన్య కూడా రీసెంట్‌గా బబుల్ గం సినిమాతో మంచి పేరు సంపాదించారు. 'డి.జె టిల్లు' సినిమాతో బాగా పాపులర్ అయిన సిద్దూ.. ఈ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో 'టిల్లు స్క్వేర్'తో మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇలా ఉండగా తాజాగా ఆయన బ్రదర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment