సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డిజె టిల్లు’. విమల్ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం శనివారం విడుదలైంది. ‘‘మా సినిమాకు మంచి స్పందన లభిస్తోంది’’ అని పాత్రికేయుల సమావేశంలో చిత్రబృందం పేర్కొంది. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటిదాకా నా కెరీర్‌లో నేను బ్లాక్ బస్టర్ అనే మాట వినలేదు. ఈ సినిమాతో విన్నాను’’ అన్నారు.
‘‘ఈ కథ విన్నప్పుడే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందనుకున్నాం. మా అంచనా నిజమైంది. ఇలాంటి చిత్రాలు విజయం సాధించడంవల్ల ఇంకా కొత్తవాళ్లను ప్రోత్సహించాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. ‘డిజె టిల్లు’ సీక్వెల్‌ని సిద్ధు నెక్ట్ పిక్చర్‌గా చేస్తున్నాం’’ అన్నారు నాగవంశీ. ‘‘థియేటర్లో ప్రేక్షకుల సందడి చూసి నమ్మలేకపోయాం. డైలాగ్స్‌కి వస్తున్న క్రెడిట్‌ని సిద్ధూకి ఇస్తాను. నాగవంశీగారి నమ్మకం, మా టీమ్ కష్టం ఈ విజయానికి కారణం’’ అన్నారు విమల్ కృష్ణ.
Comments
Please login to add a commentAdd a comment