హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలె థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన చై ఇప్పుడు లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. సినిమాకు ముందే బీటౌన్ ఆడియెన్స్‌కు దగ్గరవుతున్న చై భవిష్యత్తులో మరిన్ని హిందీ సినిమాలు చేసేందుకు పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు.
తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం చై మరో సినిమాను లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. డిజే టిల్లు సినిమాతో సత్తా చాటిన విమల్ కృష్ణతో చై తన నెక్ట్స్ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. చై ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ పూర్తికాగానే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. చదవండి: సమంత ఇంకా డిప్రెషన్‌లోనే ఉందా? చేతిలో ఆ బుక్
Comments
Please login to add a commentAdd a comment