Director Vimal Krishna Leaved From DJ Tillu Sequel - Sakshi
Sakshi News home page

DJ Tillu: డీజే టిల్లు సీక్వెల్‌ నుంచి డైరెక్టర్‌ అవుట్‌ !.. కారణం ఇదేనా ?

Published Mon, Jul 18 2022 4:51 PM | Last Updated on Mon, Jul 18 2022 6:50 PM

Director Vimal Krishna Leaved From DJ Tillu Sequel - Sakshi

Director Vimal Krishna Leaved From DJ Tillu Sequel: చిన్న సినిమాగా విడుదలైన 'డీజే టిల్లు' బాక్సాఫీస్‌ వద్ద దుమ్ములేపింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్‌ అయి అట్లుంటది ప్రేక్షకులతోటి అనేలా చేసింది. లైఫ్‌ బిఫోర్ వెడ్డింగ్‌, గుంటూరు టాకీస్‌, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్‌ హిజ్‌ లీల చిత్రాలలో నటించి మెప్పించాడు సిద్ధు జొన్నల గడ్డ. ఈ యంగ్‌ హీరోకు 'డీజే టిల్లు' సినిమాతో సుమారు 12 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో పేరొచ్చింది. ఇక 'డీజే టిల్లు' మూవీ ఎంత పెద్ద హిట్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా ప్లాన్‌ చేశారు దర్శకనిర్మాతలు. 

అయితే తాజాగా 'డీజే టిల్లు' డైరెక్టర్ విమల్‌ కృష్ణ ఈ సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ సీక్వెల్ ‍ప్రారంభమైన తర్వాత దర్శకుడు విమల్, హీరో సిద్ధు మధ్య పలు క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ చోటు చేసుకున్నాయని వినికిడి. సిద్ధు ప్రవర్తనతో హర్ట్‌ అయిన విమల్‌ కృష్ణ ఈ సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ సీక్వెల్‌కు అన్ని తానై చూసుకుంటున్నాడట సిద్ధు. విమల్‌ ప్లేస్‌లో కొత్త దర్శకుడు సైతం వచ్చనట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ ప్రాజెక్ట్‌, కొత్త డైరెక్టర్‌ వివరాలు వెల్లడి కానున్నట్లు సమాచారం. కాగా అటు విమల్‌ కృష్ణ.. నాగ చైతన్యకు ఒక కథ సిద్ధం చేసినట్లు సమాచారం. 

చదవండి: పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర బ్యూటీ!.. ఫొటోలు వైరల్‌
పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ..
స్టార్ హీరోయిన్‌ సోదరుడితో ఇలియానా డేటింగ్‌ !.. 
బ్యాడ్ న్యూస్‌ చెప్పిన నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement