2022లో అప్పుడే ఫస్టాఫ్ పూర్తయింది. సినిమాటిక్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే ఇంటర్వెల్ కార్ట్ పడింది. మరి ఇప్పటి వరకు వచ్చిన సినిమలెన్ని? వాటిల్లో హిట్ అయినవి ఎన్ని? బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డవి ఎన్నో
గత రెండేళ్లు కరోనా రీజన్‌తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ట్రబుల్స్ ఫేస్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా థర్డ్ వేవ్ రీజన్ తో మూవీస్ పోస్ట్ పోన్ అయ్యాయి.ఈ సిచ్యువేషన్ లో కూడా ధైర్యంగా థియేటర్స్ లోకి అడుగు పెట్టాడు ‘బంగ్రారాజు’. అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం టాలీవుడ్ కు ఫస్ట్ హిట్ అందించింది.
ఫిబ్రవరి రెండో వారానికి థర్డ్ వేవ్ కాస్త కంట్రోల్ కావడంతో కాస్త ధైర్యంగా పూర్తిస్థాయిలో ఇండియా వైడ్ గా సినిమా స్క్రీన్స్ తెరుచుకున్నాయి. ‘డీజే టీల్లు’ పెట్టిన డీజేతో ఫిబ్రవరి మొత్తం మార్మోగింది. ఆ తర్వాత నుంచి వరుస పెట్టి తెలుగు సినీ పరిశ్రమ భారీ చిత్రాలను విడుదల చేస్తూ వెళ్లింది.
మార్చిలో వచ్చిన రెండు పాన్ ఇండియా చిత్రాల్లో రాధేశ్యామ్ పూర్తిగా నిరాశపరచగా, ఆర్ ఆర్ ఆర్ మాత్రం ఎన్నో రికార్డులు తిరగరాసింది.టాలీవుడ్ సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఏప్రిల్లో టాలీవుడ్ కు హిట్ లేదు.మిషన్ ఇంపాజిబుల్ , గని, ఆచార్య ఇండస్ట్రీని దారుణంగా డిజప్పాయింట్ చేసాయి.
మేలో సర్కారు వారి పాటతో సూపర్ స్టార్ జోరు చూపించాడు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ 3(ఎఫ్3) కూడా బాగానే ఎంటర్ టైన్ చేసింది. జూన్‌లో వచ్చిన ‘మేజర్’ పాన్ ఇండియా లెవల్లో ఇంప్రెస్ చేశాడు. అదే నెలలో వచ్చిన అంటే సుందరానికి, విరాటపర్వం చిత్రాలు మంచి రివ్యూస్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి.
ఇక బాలీవుడ్ సిసిచ్యువేషన్ మాత్రం చాలా బ్యాడ్ గా ఉంది. మొత్తంగా 25 చిత్రాలు విడుదలైతే అందులో గంగూబాయి, కశ్మీర్ పైల్స్, భూల్ భులయ్యా 2 మాత్రమే విజయాన్ని అందుకున్నాయి. మిగితావన్ని డిజాస్టర్స్ లిస్ట్ లోకి వెళ్లిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment