![Anupama Parameswaran Fan Worried On Her Kiss Scenes - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/19/Anupama-Parameswaran-Fan.jpg.webp?itok=7tt7kL_r)
అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మలయాళ సినిమాతో నటిగా మారినప్పటికీ వరసగా తెలుగు సినిమాలు చేసి ఇక్కడ సెటిలైపోయింది. అయితే ప్రస్తుతం ఈమెకు ఛాన్సులు పెద్దగా రావడం లేదు. అలానే ఉన్న ఒకటి రెండు ప్రాజెక్టుల్లోనూ సరికొత్తగా కనిపిస్తూ అందరూ అవాక్కయ్యాలే చేస్తోంది. తాజాగా ఈమె అభిమాని కూడా అదే ఫీలయ్యాడు. ఎందుకు అలా చేస్తున్నారంటూ ఓ వీడియోనే రిలీజ్ చేశాడు. ఇంతకీ ఏం చెప్పాడు?
'ప్రేమమ్' అనే మలయాళ మూవీతో హీరోయిన్ అయిన అనుపమ.. 'అఆ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. శతమానం భవతి, ఉన్నది ఒకటి జిందగీ, హలో గురు ప్రేమకోసమే లాంటి సినిమాల్లో పద్ధతిగా కనిపించి ఆకట్టుకుంది. కానీ ఈ మూవీస్ వల్ల ఈమెకి క్లాస్ ఇమేజ్ అయితే వచ్చింది గానీ పెద్దగా ఛాన్సులేం తీసుకురాలేదనో ఏమో గానీ రూట్ మార్చింది. 'రౌడీ బాయ్స్' సినిమాలో ముద్దు సీన్స్ చేసి ఆశ్చర్యపరిచింది.
(ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో)
తాజాగా 'డీజే టిల్లు 2' ట్రైలర్‌లో అనుపమని కూడా చాలామంది షాకయ్యారు. ఎందుకంటే లిప్ కిస్ చేయడంలో హద్దులు దాటేసినట్లే కనిపిస్తుంది. అలానే సినిమాలోనూ హాట్ హాట్‌గా కనిపించబోతుందని అందరికీ అర్థమైపోయింది. అయితే ట్రెండ్‌కి తగ్గట్లు అనుపమ మారే ప్రయత్నం చేస్తుండగా.. కొందరు అభిమానులు మాత్రం దీన్ని తీసుకోలేకపోతున్నారు. తాజాగా ఓ కుర్రాడు ఏకంగా అనుపమ గ్లామర్ రోల్స్ చేస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో చేశాడు.
'నా ఆటోలో మీ ఫొటో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా అండి. ఒకప్పుడు మీరు తీసిన సినిమాలు అలాంటివి. ప్రేమమ్, అఆ, శతమానం భవతి మూవీస్ చేసిన మీరు.. ఇప్పుడు రౌడీబాయ్స్, టిల్లు స్క్వేర్ సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు సావిత్రి గారు, సౌందర్య గారిలానే సినిమాలు మీరు చేస్తారని అనుకున్నాం. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది మాత్రం మాకేం నచ్చడం లేదండి' అని వీడియోలో చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: తన పేరుతో మోసం.. బండారం బయటపెట్టిన సీరియల్ నటి)
#TilluSquare ట్రైలర్ చూసి గుండె పగిలిన @anupamahere అభిమాని, తన బాధ చెప్పుకున్నాడు. pic.twitter.com/Wnc4yRB1oA
— Actual India (@ActualIndia) February 18, 2024
Comments
Please login to add a commentAdd a comment