సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డీజే టిల్లు’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ చెప్పిన విశేషాలు.
♦నేను, విమల్ కలిసే ‘డీజే టిల్లు’ కథ, స్క్రీన్ ప్లే రాసుకున్నాం. నేను డైలాగ్స్ కూడా రాశాను. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌కు ఓ చిన్న క్రైమ్ థ్రిల్లర్‌ను జోడించి ఈ సినిమాను రూపొందించాం. ఇందులో నేను టైటిల్ రోల్ (టిల్లు) చేశాను. డీజే టిల్లు క్యారెక్టర్‌లో తెలంగాణ ఫ్లేవర్ కనిపిస్తుంది.
♦డీజే టిల్లు పాయింట్ ఆఫ్ వ్యూలో ఓ అమ్మాయి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. నేహా శెట్టి బాగా చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, చివర్లో లైఫ్ గురించి ఓ సందేశం చెప్పి వెళ్లిపోతాడు డీజే టిల్లు. ఈ సినిమా హిట్ అయితే సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉంది. ఓ ఫ్రాంచైజీలా చేస్తే బాగుంటుందనుకుంటున్నాం.
♦‘అల.. వైకుంఠపురములో..,’ ‘జెర్సీ’ వంటి సినిమాలను నిర్మించిన సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై వస్తున్న ఈ సినిమాకు నా వల్ల మరింత గౌరవం పెరగాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం దర్శకులు త్రివిక్రమ్, నాగవంశీ, చినబాబుగార్లు ఇన్‌పుట్స్ ఇచ్చారు. అయితే ఏం చెప్పినా డీజే టిల్లు క్యారెక్టర్ ఎఫెక్ట్ కాకుండా చూసుకోండి అంటూ ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమాను త్రివిక్రమ్‌గారు చూసి ‘సినిమా హిట్.. ఏ స్థాయి హిట్ అవుతుందన్నదే చర్చ’ అని అన్నారు.
♦ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటుంది. రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. నేను కూడా ఈ చిత్రంలో ‘నువ్వలా..’ అనే పాట పాడాను.
♦స్వతహాగా నేను రచయితను కాదు. పరిస్థితులే నన్ను రచయితగా మార్చాయి. ఓ దశలో నాకు అవకాశాలు తగ్గాయి. మన కోసం మనమే కథలు రాసుకోవాలని రచయిత అయ్యాను. భవిష్యత్‌లో కూడా రచయితగా కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం దర్శకత్వం ఆలోచన మాత్రం లేదు. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లోనే మలయాళ సినిమా ‘కప్పెలా’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment