siddu
-
సినిమాకు వెళ్దామని తీసుకెళ్లి, హతమార్చి, రైలు ప్రమాదంలా చిత్రీకరించీ..
సాక్షి, మహబూబాబాద్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని పాత కురవి గేటు ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కాగా సదరు యువకుడిని కొట్టి హత్య చేసి రైలు ప్రమాదంలో మృతిచెందినట్లు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు రాస్తారోకో చేపట్టి ఆందోళనకు దిగారు. జీఆర్పీ డోర్నకల్ ఎస్సై కె.శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. కురవి మండలం చంద్యా తండాకు చెందిన భూక్యా నగేష్, శారద దంపతుల కుమారుడు భూక్యా సిద్ధు(19) శనివారం అర్ధరాత్రి మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని పాత కురవి గేటు ప్రాంతంలో రైలు ఢీకొని మృతిచెందాడని తెలిపారు. సమాచారం అందిన వెంటనే తాము సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం గదికి తరలించి భద్రపరిచామన్నారు. ఆదివారం ఉదయం సిద్ధు తండ్రి నగేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. కాగా మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం సిద్ధు మృతిపై అనుమానాలు ఉన్నాయని, సమగ్ర విచారణ చేసి దోషులను గుర్తించి శిక్షించాలని కోరారన్నారు. కుమారుడి మృతికి విష్ణువర్ధన్, శివపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. విచారణ అనంతరం కేసును మహబూబాబాద్ టౌన్ పోలీసులకు అప్పగిస్తామని పేర్కొన్నారు. బంధువుల రాస్తారోకో.. భూక్యా సిద్ధు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టు మార్టం చేసేందుకు తీసుకురాగా అతడి బంధువులు, కుటుంబ సభ్యులు సిద్ధు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అండర్ బ్రిడ్జి వద్ద రాస్తారోకో చేపట్టి ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఊరుకోబోమని హెచ్చరిస్తూ సిద్ధు మృతదేహాన్ని పోస్టుమార్టం గది నుంచి బయటకు తీసుకువచ్చి రోడ్డుపై పెట్టి నినాదాలు చేశారు. మృతుడి తండ్రి నగేశ్ మాట్లాడుతూ.. తమ కొడుకు సిద్ధు హైదరాబాద్‌లో ఆటో నడుపుతున్నట్లు తెలిపారు. తండాలో జరిగిన శుభాకార్యానికి హాజరయ్యాక, తండాకే చెందిన కొందరు యువకులు అతనిని సినిమాకు వెళ్దామని మహబూబాబాద్‌కు తీసుకువచ్చారన్నారు. పథకం ప్రకారం హతమార్చి రైలు ఢీకొని మృతిచెందినట్లు వారే తమకు ఫోన్ చేసి వివరాలు చెప్పినట్లు పేర్కొన్నారు. పోలీసులు విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న టౌన్ సీఐ సతీష్, ఎస్సై విజయరాంకుమార్ మృతుడి బంధువులతో మాట్లాడి పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇవి కూడా చదవండి: ఆ ట్రిపుల్‌ఐటీలో అసలేం జరుగుతుంది? విద్యార్థిది హత్యా! లేక మరేంటి? -
ఆయన సంపాదనను మరణం కూడా ఆపలేదు.. అతడెవరో తెలుసా?
ప్రముఖ పంజాబీ సింగర్ 'సిద్దూ మూసేవాలా' (Sidhu Moosewala) దుండగులు చేతిలో దుర్మరణం పాలైన విషయం అందరికి తెలిసిందే. అయితే అతని పాటలు అతని మరణానంతరం కూడా భారీగా సంపాదిస్తున్నాయి. 2023 ఏప్రిల్ 7న సిద్దు కొత్త సాంగ్ రిలీజ్ అయింది. యూట్యూబ్ ఛానల్లో విడుదలైన ఈ పాట కేవలం ఐదు గంటల్లో ఐదున్నర మిలియన్స కంటే ఎక్కువ వ్యూస్ పొందగలిగింది. 29 సంవత్సరాల వయసులో సిద్ధు మూసేవాలా మరణించినప్పటికీ అభిమానుల ఫాలోయింగ్‌తో ఇప్పటికీ తన యూట్యూబ్ రాయల్టీలు, డీల్‌ల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించగలిగాడు. ప్రస్తుతం అతని ఆస్తులన్నీ కూడా వారి తల్లిదండ్రులకు బదిలీ చేశారు. సిద్దు మరణించే నాటికి ఆయన ఆస్తుల విలువ సుమారు 14 మిలియన్ డాలర్లు, భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు వంద కోట్లకంటే ఎక్కువ. సిద్ధు మూసేవాలా ఖరీదైన కార్లు, ఇతరత్రా ఖరీదైన వస్తువులను కలిగి ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఆయన లైవ్ షోలు, కచేరీ వంటి వాటి కోసం సుమారు రూ. 20 లక్షలు, బహిరంగ ప్రదర్శనలకు రూ. 2 లక్షల కంటే ఎక్కువ వసూలు చేసేవాడని కూడా తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఐస్‌క్రీమ్ అమ్మబోతున్న అంబానీ: కొత్త రంగంలో రిలయన్స్ అడుగు..) అతి చిన్న వయసులోనే ప్రఖ్యాత గాయకుడిగా ప్రసిద్ధి చెందిన సిద్ధు.. యూట్యూబ్ ఛానల్ మరణానంతరం కూడా సంపాదిస్తోంది. యూట్యూబ్ పాలసీల ప్రకారం వ్యూవ్స్ ఆధారంగా రాయల్టీలు అందిస్తుంది. అంటే ఏదైనా వీడియో లేదా పాట 1 మిలియన్ వ్యూస్ పొందితే యూట్యూబ్ 1000 డాలర్లను అందిస్తుంది. ఇటీవలే విడుదలైన సిద్ధూ మూసేవాలా కొత్త పాట 18 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ పొందింది. దీంతో ప్రస్తుతానికి యూట్యూబ్ దీనికి రూ. 14.3 లక్షలు అందించాల్సి ఉంది. ఇది మరింత ఎక్కువ వ్యూస్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతే కాకుండా స్పాటిఫై, వింక్, ఇతర మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి అడ్వర్టైజ్మెంట్ డీల్స్ & రాయల్టీల ద్వారా సిద్ధూ మూసేవాలా తన మరణానంతరం తన పాటల ద్వారా రూ. 2 కోట్లకు పైగా సంపాదించాడు. ఇటీవల విడుదలైన వీడియోలో సిద్దు మూసేవాలా గాత్రానికి నైజీరియన్ సింగర్ బర్నా బాయ్ రాప్ అందించారు. ఈ వీడియోలో మొత్తం సిద్దు మూసేవాలాకి ఏర్పడిన ఒక మంచి ఫేం, అలాగే ఆయనకు వచ్చిన మంచి పేరుతో సిటీలో ఎక్కడపడితే అక్కడ ఆయనకు ఏర్పాటు చేసిన కటౌట్లు, బిల్ బోర్డుల గురించి ప్రస్తావించారు. అంతే కాకుండా ఆయన అభిమానులు గోడలకు సిద్ధూ పిక్చర్లు పెయింట్ చేయడం, ఆయన ఫోటోలు గోడలకు అతికించడం, వాహనాలకు అతికించడం వంటివి కూడా చూడవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అద్భుతమైన టెక్నాలజీతో సిద్దు మూసే వాలా కూడా కనిపించినట్లుగా మ్యాజిక్ చేశారు. -
డీజే టిల్లుతో మంచు లక్ష్మీ మాస్ డ్యాన్స్ చూశారా
Manchu Lakshmi And Dj Tillu Mass Steps: మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. వ్యక్తిగత విషయాలతో పాటు ప్రొఫెషనల్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు ఫన్నీ వీడియోలు, డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తుంటారు. తాజాగా ఆమె చేసిన ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. డీజే టిల్లు మూవీలోని ఫేమస్ మాస్ సాంగ్ టిల్లు అన్నా డీజే పెడితే.. అంటూ సాగే పాటకి అదే లెవల్లో ఊరమాస్ స్టెప్పులేసింది. ఇందులో మంచు లక్ష్మీతో కలిసి హీరో సిద్దు, అమన్ చిందులేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
పంజాబ్ నటుడు దీప్ సిద్ధూ మృతి
-
థియేటర్స్‌లో డీజే టిల్లు రీసౌండ్.. నైజాంలో రికార్డు వసూళ్లు
DJ Tillu First Day Collection:: చిన్న సినిమాగా విడుదలైన 'డీజే టిల్లు' చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం నిన్న(ఫిబ్రవరి12)న రిలీజ్ అయి హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే రిలీజైన పాటలు అందరినీ ఆకట్టుకోగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పుట్టుమచ్చల వ్యవహారం సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది. విడుదలైన తొలిరోజు నుంచే అదిరిపోయే వసూళ్లతో డీజే టిల్లు రీసౌండ్ వినిపిస్తుంది. ఇండియా సహా ఓవర్సీస్లోనూ మంచి షేర్స్ రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే సుమారు రూ.3కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం గ్రాస్ రూ. 8.10కోట్ల షేర్ సాధించింది. ఒక్క రోజులోనే నైజాంలో బ్రేక్ఈవెన్ సాధించినట్లు టాక్ వినిపిస్తుంది. ఇదే కంటిన్యూ అయితే ఫుల్‌రన్‌లో కశ్చితంగా ఈ సినిమా గట్టి లాభాలను తీసుకొస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. -
ఆ మాటలు వింటుంటే కొత్తగా ఉంది: హీరో సిద్ధు
‘‘నేను నటించిన ‘డిజె టిల్లు’కి టికెట్ బుకింగ్స్, బ్రేక్ ఈవెన్, థియేట్రికల్ రైట్స్ అమ్మకం, ఓవర్సీస్లో బుకింగ్స్.. వంటి మాటలు వింటుంటే కొత్తగా ఉంది. థియేటర్‌కు రండి.. మిమ్మల్ని (ప్రేక్షకులు) నవ్విస్తాం’’ అని సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డిజె టిల్లు’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు, హీరో విశ్వక్ సేన్ అతిథులుగా పాల్గొన్నారు. -
అవకాశాలు తగ్గాయి, రచయితగా మారాను: డీజే టిల్లు హీరో
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డీజే టిల్లు’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ చెప్పిన విశేషాలు. ♦నేను, విమల్ కలిసే ‘డీజే టిల్లు’ కథ, స్క్రీన్ ప్లే రాసుకున్నాం. నేను డైలాగ్స్ కూడా రాశాను. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌కు ఓ చిన్న క్రైమ్ థ్రిల్లర్‌ను జోడించి ఈ సినిమాను రూపొందించాం. ఇందులో నేను టైటిల్ రోల్ (టిల్లు) చేశాను. డీజే టిల్లు క్యారెక్టర్లో తెలంగాణ ఫ్లేవర్ కనిపిస్తుంది. ♦డీజే టిల్లు పాయింట్ ఆఫ్ వ్యూలో ఓ అమ్మాయి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. నేహా శెట్టి బాగా చేశారు. ఎంటర్టైన్మెంట్తో పాటు, చివర్లో లైఫ్ గురించి ఓ సందేశం చెప్పి వెళ్లిపోతాడు డీజే టిల్లు. ఈ సినిమా హిట్ అయితే సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉంది. ఓ ఫ్రాంచైజీలా చేస్తే బాగుంటుందనుకుంటున్నాం. ♦‘అల.. వైకుంఠపురములో..,’ ‘జెర్సీ’ వంటి సినిమాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వస్తున్న ఈ సినిమాకు నా వల్ల మరింత గౌరవం పెరగాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం దర్శకులు త్రివిక్రమ్, నాగవంశీ, చినబాబుగార్లు ఇన్పుట్స్ ఇచ్చారు. అయితే ఏం చెప్పినా డీజే టిల్లు క్యారెక్టర్ ఎఫెక్ట్ కాకుండా చూసుకోండి అంటూ ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమాను త్రివిక్రమ్‌గారు చూసి ‘సినిమా హిట్.. ఏ స్థాయి హిట్ అవుతుందన్నదే చర్చ’ అని అన్నారు. ♦ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటుంది. రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. నేను కూడా ఈ చిత్రంలో ‘నువ్వలా..’ అనే పాట పాడాను. ♦స్వతహాగా నేను రచయితను కాదు. పరిస్థితులే నన్ను రచయితగా మార్చాయి. ఓ దశలో నాకు అవకాశాలు తగ్గాయి. మన కోసం మనమే కథలు రాసుకోవాలని రచయిత అయ్యాను. భవిష్యత్‌లో కూడా రచయితగా కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం దర్శకత్వం ఆలోచన మాత్రం లేదు. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్లోనే మలయాళ సినిమా ‘కప్పెలా’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాను. -
పంచ్ పడుద్ది!
‘ఎఫ్ 2’లో ప్రేక్షకుల మీద కామెడీ పంచ్‌లు విసిరిన వరుణ్ తేజ్, లేటెస్ట్గా సీరియస్‌గా బాక్సింగ్ పంచ్‌లు ఇవ్వడానికి రెడీ అయ్యారు. తదుపరి చిత్రంలో బాక్సర్‌గా కనిపిస్తారని తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అల్లు వెంకటేశ్, సిద్దు నిర్మిస్తారు. ఆల్రెడీ అమెరికాలో బాక్సింగ్ క్లాసులతో ఫుల్ బిజీగా ఉన్నారు వరుణ్. హాలీవుడ్ చిత్రాలు ‘క్రీడ్, కార్ల్ వెదర్స్’ వంటి చిత్రాలకు యాక్షన్ సీక్వెన్స్‌ను కొరియోగ్రాఫ్ చేసిన టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేయనున్నారు. అలాగే ఒలింపిక్స్‌లో పాల్గొన్నటువంటి బాక్సర్ టోనీ జఫ్రీస్ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు వరుణ్. ఇందులో ‘యాక్షన్ కింగ్’ అర్జున్, కన్నడ స్టార్ ఉపేంద్ర, రమ్యకృష్ణ, సత్యరాజ్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి లను కీలకపాత్రల కోసం చిత్రవర్గాలు సంప్రదించినట్టు సమాచారం. తొలిసినిమా అయినప్పటికీ క్యాస్టింగ్‌తోనే ప్రాజెక్ట్‌ను ఎగై్జటింగ్‌గా తయారు చేశారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. మరోవైపు హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే చిత్రంలోనూ నటించనున్నారు వరుణ్ తేజ్. -
నా పసిడి గురి
న్యూఢిల్లీ: హానోవర్ అంతర్జాతీయ షూటింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ షూటర్ హీనా సిద్ధూ మెరిసింది. జర్మనీలో జరిగిన ఈ టోర్నీలో ఆమె మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని సాధించింది. భారత్‌కే చెందిన మరో షూటర్ శ్రీనివేత కాంస్య పతకం దక్కించుకుంది. ఫైనల్లో హీనాతోపాటు మథిల్డీ లామోల్ 239.8 పాయింట్లు స్కోరు చేసి సమఉజ్జీగా నిలిచారు. అయితే ‘షూట్ ఆఫ్’లో హీనా పైచేయి సాధించి స్వర్ణం కైవసం చేసుకోగా... మథిల్డీకి రజతం లభించింది. శ్రీనివేత 219.2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. -
ఏ పార్టీలో చేరేది త్వరలో వెల్లడిస్తా...
న్యూఢిల్లీ: తాను ఏ పార్టీలో చేరేది త్వరలో వెల్లడిస్తాననని ఎంపీ కీర్తీ అజాద్ భార్య బీజేపీ అధికార ప్రతినిధి పూనమ్ అజాద్ తెలిపారు. తనకు, తన భర్తకు బీజేపీ అన్యాయం చేసిందని ఆమె ఆరోపించారు. బీజేపీ సిద్ధూ చేసిన ఆరోపణలు ముమ్మాటికీ వాస్తవమేనన్నారు. ఆయన మూడుసార్లు అమృత్సర్ నుంచి ఎంపీగా గెలుపొందడంతో పాటు, పార్టీ కోసం దేశవ్యాప్తంగా అనేకసార్లు ప్రచారం చేశారని పూనమ్ పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని మొన్నటి ఎన్నికల్లో పక్కనపెట్టారని.. ఇదేవిధంగా తనతో పాటు తన భర్తకూ బీజేపీ అన్యాయం చేసిందన్నారు. కాగా, ఆప్ లో చేరుతున్నారా అని ప్రశ్నించగా, త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. డీడీసీఏ కుంభకోణానికి సబంధించి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై ఆరోపణలు చేయడంతో ఎంపీ కీర్తి అజాద్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీని వీడడం వల్ల లోక్ సభ సభ్యునిగా ఉన్న అనర్హత వేటు పడే అవకాశం ఉండటంతో కీర్తీ అజాద్ తటపటాయిస్తున్నట్లు తెలుస్తోంది. -
3 ఇడియట్స్
నందు, సిద్ధు, శ్రీరాజ్ హీరోలుగా వైకుంఠలవ్య దర్శకత్వంలో నాగోతు రమేష్‌బాబు, వెంపాడ శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘3 ఇడియట్స్’. ఇటీవలే ఈ చిత్రం పాటలను రికార్డ్ చేశారు. ఆరు పాటలకు నవనీతాచారి అద్భుతమైన స్వరాలిచ్చారని, వచ్చే నెల మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘బీటెక్ చదువుతున్న ముగ్గురు యువకులు చదువుని పక్కన పెట్టి, ప్రేమ అనే దారిలోకి వెళితే పర్యవసానం ఎలా ఉంటుంది? అనేది ఈ చిత్రం కథాంశం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, పాటలు: పైడిశెట్టి రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బలగ సుధాకర్‌రావు.