
న్యూఢిల్లీ: హానోవర్ అంతర్జాతీయ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షూటర్ హీనా సిద్ధూ మెరిసింది. జర్మనీలో జరిగిన ఈ టోర్నీలో ఆమె మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని సాధించింది. భారత్‌కే చెందిన మరో షూటర్ శ్రీనివేత కాంస్య పతకం దక్కించుకుంది.
ఫైనల్లో హీనాతోపాటు మథిల్డీ లామోల్ 239.8 పాయింట్లు స్కోరు చేసి సమఉజ్జీగా నిలిచారు. అయితే ‘షూట్ ఆఫ్’లో హీనా పైచేయి సాధించి స్వర్ణం కైవసం చేసుకోగా... మథిల్డీకి రజతం లభించింది. శ్రీనివేత 219.2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment