‘‘నేను నటించిన ‘డిజె టిల్లు’కి టికెట్ బుకింగ్స్, బ్రేక్ ఈవెన్, థియేట్రికల్ రైట్స్ అమ్మకం, ఓవర్సీస్‌లో బుకింగ్స్.. వంటి మాటలు వింటుంటే కొత్తగా ఉంది. థియేటర్‌కు రండి.. మిమ్మల్ని (ప్రేక్షకులు) నవ్విస్తాం’’ అని సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డిజె టిల్లు’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు, హీరో విశ్వక్ సేన్ అతిథులుగా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment