టీజే టిల్లు సీక్వెల్‌ నుంచి క్రేజీ అప్‌డేట్‌ | Tillu Square Is Announced Officially As Siddu Jonnalagadda DJ Tillu Sequel | Sakshi
Sakshi News home page

టీజే టిల్లు సీక్వెల్‌ నుంచి క్రేజీ అప్‌డేట్‌

Published Thu, Oct 27 2022 6:25 AM | Last Updated on Thu, Oct 27 2022 8:35 AM

Tillu Square Is Announced Officially As Siddu Jonnalagadda DJ Tillu Sequel - Sakshi

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన హిట్‌ మూవీ ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా ‘డీజే టిల్లు స్క్వేర్‌’ రూపొందనుంది. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేసి వచ్చే మార్చిలో చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. అనుపమా పరమేశ్వరన్‌ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. 

‘డబుల్‌ ఫన్‌.. డబుల్‌ రొమాన్స్‌’ అని ట్వీట్‌ చేశారు సిద్ధు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రామ్‌ మిరియాల, కెమెరా: సాయి ప్రకాష్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement