'టిల్లు 2'‌లో అనుపమ గ్లామర్ షో.. | Anupama Parameswaran Remuneration For 'Tillu Square' Movie - Sakshi
Sakshi News home page

Anupama Remuneration: టిల్లు కోసం రెమ్యునరేషన్ పెంచేసిన అనుపమ..

Feb 21 2024 11:06 AM | Updated on Feb 21 2024 12:52 PM

Anupama Parameswaran Remuneration For DJ Tillu 2 Movie - Sakshi

అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరు చెప్పగానే క్లాస్ లుక్స్, పద్ధతిగా ఉండే పాత్రలు గుర్తొస్తాయి. కానీ అదంతా మొన్నటివరకు అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా 'డీజే టిల్లు 2' ట్రైలర్ రిలీజైన తర్వాత అందరికీ ఒక్క నిమిషం మతి పోయింది. ఎందుకంటే హీరో సిద్ధుతో ఓ సీన్‌లో ఘాటైన ముద్దు సీన్‌లో కనిపించింది. అలానే లుక్స్ అన్నీ కూడా హాట్‌గానే ఉన్నాయి. చూస్తుంటే అస్సలు తగ్గినట్లు కనిపించట్లేదు. అయితే ఇలా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం కోసం రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుకుంటోందట.

కేరళ కుట్టి అనుపమ.. సొంత భాషలో తీసిన 'ప్రేమమ్' మూవీతో హీరోయిన్ అయిపోయింది. 'అఆ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'శతమానం భవతి', ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే తదితర చిత్రాల్లో నటించింది. వీటన్నింటిలో కాస్త సంప్రదాయంగా ఉండే పాత్రల్లో కనిపించింది. కానీ ఎక్కడా గీత దాటినట్లయితే కనిపించలేదు. 

(ఇదీ చదవండి: క్షమాపణ చెప్పిన '12th ఫెయిల్' హీరో.. ఆ పోస్ట్ డిలీట్)

కొన్నాళ్ల ముందు 'రౌడీ బాయ్స్' సినిమాలో నటించిన అనుపమ.. కొత్త కుర్రాడు ఆశిష్‌తో ముద్దు సన్నివేశాలు చేసి షాకిచ్చింది. దీని తర్వాత మళ్లీ కార్తికేయ 2, 18 పేజీస్ లాంటి సినిమాల్లో కాస్త నార్మల్‌గా కనిపించింది. ఇప్పుడు 'డీజే టిల్లు 2' పూర్తిగా రెచ్చిపోయింది. హాట్‌గా కనిపించడం, ఘాటైన లిప్ కిస్ సీన్స్ చేసింది. ఈ తరహా పాత్ర అనుపమకు తొలిసారి అని చెప్పొచ్చు. 

అయితే ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ.కోటి నుంచి కోటిన్నర మధ్య రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనుపమ.. 'టిల్లు స్వ‍్కేర్' కోసం మాత్రం రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకుందట. గ్లామర్ షో చేసినందుకు ఇదా అసలు కారణమని సినీ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే ఇదే మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకోవాలని ఈ బ్యూటీ ఫిక్స్ అయిందట. మార్చి 29న 'డీజే టిల్లు 2' థియేటర్లలోకి రాబోతుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement