Tillu Square: DJ Tillu 2 Release Date Locked - Sakshi
Sakshi News home page

Tillu Square: డీజే టిల్లు 2 రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Published Tue, Jun 6 2023 3:53 AM | Last Updated on Tue, Jun 6 2023 8:50 AM

Tillu Square: DJ Tillu 2 Release Date Fix - Sakshi

‘డీజే టిల్లు పేరు.. వీని స్టయిలే వేరు..’ అంటే యూత్‌తో పాటు ఫ్యామిలీస్‌ని కూడా ఆకట్టుకున్నాడు టిల్లు. సిద్ధు జొన్నలగొడ్డ టైటిల్‌ రోల్‌లో మీడియమ్‌ బడ్జెట్‌తో రూపొందిన ‘డీజే టిల్లు’ మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా సిద్ధు జొన్నలగడ్డతోనే నాగవంశీ, సాయి సౌజన్య ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రం నిర్మిస్తున్నారు.

మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌ కథానాయిక. ఈసారి రెట్టింపు వినోదం గ్యారంటీ అంటూ.. సెప్టెంబర్‌ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సోమవారం చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అలాగే సిద్ధు, అనుపమల రొమాంటిక్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది. ఈ చిత్రానికి సంగీతం: రామ్‌ మిరియాల, శ్రీ చరణ్‌ పాకాల, కెమెరా: సాయి ప్రకాశ్‌ ఉమ్మడిసింగు, సమర్పణ: శ్రీకర స్టూడియోస్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement