Sidhu Jonnalagadda DJ Tillu 2 Movie And Other Upcoming Movies Updates, Deets Inside - Sakshi
Sakshi News home page

Sidhu Jonnalagadda Upcoming Movies: విలన్‌గా మారనున్న డీజే టిల్లు!

Jun 18 2022 1:11 PM | Updated on Jun 18 2022 1:54 PM

DJ Tillu Fame Sidhu Jonnalagadda Upcoming Movies Updates - Sakshi

ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన డీజే టిల్లు చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఈ మూవీతో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారాడు డీజే టిల్లు అలియాస్ సిద్ధూ జొన్నలగడ్డ. డీజే టిల్లు  తర్వాత  ఈ యంగ్‌ హీరో నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు.  ఇంతకీ టిల్లూ మ్యాన్ ఇప్పుడు ఏం చేస్తున్నట్లు..అంటే త్వరలోనే రెండు కొత్త సినిమాలను ప్రకటించబోతున్నాడట. అందులో ఒకటి డీజే టిల్లు సీక్వెల్‌. 

నిజానికి సినిమా రిలీజ్ కు ముందే ఈ మూవీకి సీక్వెల్‌ని ప్రకటించింది సితారా ఎంటర్ టైన్ మెంట్స్. మూవీ రిలీజ్ కావడం, బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించడంతో సీక్వెల్ పక్కా అని కన్ ఫర్ మేషన్ వచ్చేసింది. కొద్ది రోజులుగా ఈ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ పనుల్లో సిద్దూ బిజీగా ఉన్నాడట.

సీక్వెల్లో టిల్లు నయా లుక్ లో సర్ ప్రైజ్ చేయనున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో డీజే వర్క్ పక్కన పెట్టి ఫారిన్ గర్ల్ లో లవ్ లోఉన్నట్లు టిల్లు క్యారెక్టర్ ను చూపించారు. సీక్వెల్లో మళ్లీ టిల్లు డీజే వైపు ఎందుకు వెళ్తాడు అనేది ఆసక్తికరంగా చూపించబోతున్నారట.

డీజే టిల్లు 2 తో పాటు మరో కొత్త సినిమాలోనూ సిద్దూ నటించేందుకు రెడీ అవుతున్నాడట. ఈ మూవీలో హీరో క్యారెక్టర్ కాకుండా విలన్ రోల్ చేసి సర్ ప్రైజ్ చేస్తాడట. డీజే టిల్లుకు ముందు కల్కీ మూవీలోని విలన్ రోల్ చేసాడు సిద్ధూ. కాకపోతే ఈసారి సీరియస్ విలన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement