Siddhu Jonnalagadda DJ Tillu Sequel To Go On Floors In August - Sakshi
Sakshi News home page

DJ Tillu 2: 'డీజే టిల్లు 2'కు ముహూర్తం ఫిక్స్‌.. అప్పటి నుంచే షూటింగ్‌

Published Sun, Jun 26 2022 4:35 PM | Last Updated on Sun, Jun 26 2022 5:49 PM

Siddhu Jonnalagadda DJ Tillu Sequel To Go On Floors In August - Sakshi

Siddhu Jonnalagadda DJ Tillu Sequel To Go On Floors In August: చిన్న సినిమాగా విడుదలైన 'డీజే టిల్లు' బాక్సాఫీస్‌ వద్ద దుమ్ములేపింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్‌ అయి ప్రేక్షకులతోటి 'అట్లుంటది మనతోని' అనేలా చేసింది. అయితే విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీకి కొనసాగింపు కూడా ఉంటుందనేలా సినిమా చివర్లో హింట్‌ ఇచ్చారు. అంతేకాకుండా ఆడియెన్స్‌ సైతం ఈ సినిమాకు సీక్వెల్‌ వస్తే 'అట్లుంటది మాతోటి' అనేలా హిట్‌ ఇద్దామని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్‌ ఆసక్తి రేపుతోంది. ఈ ట్వీట్‌తో 'డీజే టిల్లు' సినిమా సీక్వెల్‌ ప్రారంభం కానుందని తెలుస్తోంది. 

స్క్రిప్ట్‌కు సంబంధించిన పుస్తకాన్ని దేవుడి పటాల ముందుంచి పూజ చేసిన ఫొటోను శనివారం (జూన్ 25) ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు నాగవంశీ. ఈ ఫొటోకు 'ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్రాంచైజీ రౌండ్‌ 2 పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ క్రేజీ అడ్వెంచర్‌ షూటింగ్‌ ఆగస్టు నుంచి ప్రారంభమవుతుంది.' అని రాసుకొచ్చారు.

(చదవండి: చై-సామ్‌ బాటలో మరో టాలీవుడ్‌ జంట?)


దీంతో నెటిజన్స్‌ 'డీజే టిల్లు'కు సీక్వెల్ రానుందని భావిస్తున్నారు. అలాగే 'టిల్లు అన్న రెడీ అవుతున్నాడు' అని నెటిజన్స్‌ కామెంట్ చేయగా, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ 'సోదరా.. పార్ట్‌ 2 కూడా బ్లాక్‌బస్టర్‌ కావాలి' అని విష్‌ చేస్తూ సిద్ధు జొన్నలగడ్డను ట్యాగ్‌ చేశారు. దీనికి 'థ్యాంక్యూ సర్‌' అని సిద్ధు రిప్లై ఇ‍చ్చాడు. ఈ ట్వీట్లతో 'డీజే టిల్లు 2' రానుందని తెలుస్తోంది. 

(చదవండి: హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు..
'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు
9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్‌ హీరోయిన్‌..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement