ఫెయిలవుతాననే భయంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా భూదాన్‌పోచంపల్లిలోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రధమ సంవత్సరం చదువుతున్న సుంకి సందీప్(19) గదిలో ఉరి వేసుకొని సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు.
సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్న సందీప్ పరీక్షలు సరిగా రాయకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. నిజామాబాద్‌కు చెందిన సందీప్ కళాశాల సమీపంలో ఒక రూంలో అద్దెకు ఉంటున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయగా.. మృతిని వద్ద సూసైడ్ నోట్ లభించింది.ఈ తన చావుకి ఎవరూ బాధ్యులు కారని అందులోపేర్కొన్నాడు.