
న్యూఢిల్లీ: ఆత్మహత్య చేసుకుంటానంటూ 10 అంతస్తుల భవనంపైకి ఎక్కిన ఓ వ్యక్తి పోలీసులు, అధికారులను 17 గంటలపాటు హైరానా పెట్టించాడు. చివరికి అతడిని సురక్షితంగా కిందికి తీసుకువచ్చారు. అయితే, బాలికపై వేధింపుల కేసులో నిందితుడంటూ అరెస్టు చేశారు. ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలో జరిగింది. ఢిల్లీకి చెందిన సందీప్ అలియాస్ అర్మాన్ మాలిక్(31) భార్య క్రితికా బసేరాతో కలిసి ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో హరినగర్‌లోని ఓ హోటల్‌కు వెళ్లాడు.
అక్కడ ఆ దంపతుల మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. దీంతో చచ్చిపోతానంటూ భార్యను బెదిరించి సాయంత్రం 4 గంటల సమయంలో పదో అంతస్తుపైకి ఎక్కాడు. భార్య సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వాహనాలతో సహా అక్కడికి చేరుకుని అతడిని ఒప్పించి కిందికి దించేందుకు రాత్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అతడి కోరిక మేరకు పండ్లు, బిస్కెట్లతోపాటు తన డిమాండ్లను పెద్దగా వినిపించేందుకు లౌడ్‌స్పీకర్‌నుపంపారు. చివరికి సోమవారం ఉదయం కిందికి దిగి రావడంతో ఉత్కంఠకు తెరపడింది.
Comments
Please login to add a commentAdd a comment