
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకూ ఉధృతంగా మారుతోంది. పదో రోజు కూడా కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఉద్యోగ భద్రతపై ఇప్పటికే పలువురు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా హెచ్‌సీయూ డిపో వద్ద సందీప్ అనే కండక్టర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సమయంలో సందీప్ ఒక్కసారిగా ఉద‍్వేగానికి గురయ్యాడు. బ్లేడ్‌తో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన తోటి కార్మికులు అతడిని కొండాపూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సందీప్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా ఖమ్మం డిపోకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అతడి అంత్యక్రియలు సోమవారం ఖమ్మంలో నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment