కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని ఎల్బీనగర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో గురువారం వెలుగుచూసింది. స్థానిక కాలనీకి చెందిన సందీప్(26) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలు ఎక్కవవడంతో మనస్తాపం చెంది ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచార అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చే స్తున్నారు.