పవన్‌ను నమ్మితే నట్టేట ముంచుతాడు  | Jana Sena leaders who joined YSRCP | Sakshi
Sakshi News home page

పవన్‌ను నమ్మితే నట్టేట ముంచుతాడు 

Published Thu, Nov 23 2023 5:41 AM | Last Updated on Thu, Nov 23 2023 2:48 PM

Jana Sena leaders who joined YSRCP - Sakshi

సాక్షి, అమరావతి: పవన్‌ కల్యాణ్‌ను నమ్ముకుంటే తమలాగే అందరినీ నట్టేట ముంచి, రోడ్డున పడేస్తారని జనసేన పార్టీలో కీలక నేతలు పసుపులేటి సందీప్, ఆయన తల్లి పసుపులేటి పద్మావతి చెప్పా­రు. పవన్‌కు సందీప్‌ పర్సనల్‌ సెక్రటరీగా పని చేశా­రు. పద్మావతి ఆ పార్టీ రాయలసీమ రీజియన్‌ సమన్వయకర్తగా ఎనలేని సేవలందించారు. వారు బుధ­వా­రం తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లా­డు­తూ.. పవన్‌ మాటల మాయలో పడి ఆయన కోసం, జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశామని చెప్పారు.

రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం అమలు చేస్తున్న పథకాలను పరిశీలించిన తర్వాత రాష్ట్రానికి సీఎం జగన్‌ ఎంత మేలు చేస్తున్నారో అర్థమైందని అన్నారు. సీఎం జగన్‌ అమలు చేస్తున్న పథకాలు పేద, బడుగు వర్గాలకు ఎంతో మేలు చేస్తున్నాయని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిç­Ü్తున్నాయని, అందుకే వైఎస్సార్‌సీపీలో చేరా­మని తెలిపారు. తల్లిదండ్రులు ఎవరూ వారి పిల్లలను పవన్‌ వెంట పంపవద్దని సూచించారు. అన్యాయాన్ని ప్రశి్నస్తానని, రాజకీయాల్లో మార్పు తేస్తాన­ని చెప్పే పవన్‌లో నిలకడలేదన్నారు. ధైర్యం ఉంటే తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పా­లని డిమాండ్‌ చేశారు.

పవన్‌ మాటలతో మభ్యపెడతారని సందీప్‌ చెప్పారు. ఆయన్ని నమ్ముకుని ఢిల్లీ లీడర్‌ కావాలనుకున్న తాను గల్లీకి కూడా కాకుండా పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కోట రుక్మిణి అనే మహిళ మాట మీద తనను, అమ్మ (పద్మావతి)ని పవన్‌ రోడ్డు­కీడ్చారని చెప్పారు. పవన్‌కు రుక్మిణి అంటే భయమని తెలిపారు. నాదెండ్ల మనోహర్‌కు చిత్తశుద్ధి లేదన్నారు.

పవన్‌ అహంకారి అని, ఆయన లేకుండా నాదెండ్ల మనోహర్‌ కూడా అసెంబ్లీకి వెళ్ళకూడదనుకుంటారని అన్నారు. నాదెండ్ల మనోహర్‌ హవాలా డబ్బును పార్టీ ఆఫీసుకు పంపి మారుస్తారని చెప్పారు. హైదరాబాదులో భూ కబ్జాలో ఏ 1 గా ఉన్న వ్యక్తిని పార్టీ కమిటీలో పెట్టారన్నారు. పవన్‌ టీడీపీ కోసమే పని చేస్తున్నారని, ఏపీ రాజకీయాల్లో మాట తప్పారని చెప్పారు. టీడీపీ పంచన చేరి కేడర్‌ని మోసం చేశారని తెలిపారు. పవన్‌ రాయలసీమలో బలిజల్ని తొక్కేస్తున్నారని ఆరోపించారు. 

మహిళా నేతలకు గౌరవం లేదు: పద్మావతి 
గతంలో జనసేన పార్టీ రాయలసీమ కన్వినర్‌గా పనిచేసిన పసుపులేటి పద్మావతి మాట్లాడుతూ.. చిరంజీవి అభిమానిగా ప్రజారాజ్యంతో 2009లో రాజకీయాల్లోకి వచ్చానని, 2014లో జనసేనకు అండగా నిలబడ్డానని చెప్పారు. మహిళా నేతలకు జనసేనలో గౌరవం లేదన్నారు. ఈ అంశంపై ఎక్కడైనా ఎవరితోనైనా చర్చకు సిద్ధమని సవాల్‌ చేశారు. ప­వన్‌ నిలకడలేని మనిషి అని, ఎప్పుడు ఎవరితో పొ­త్తు పెట్టుకుంటాడో తెలియదని తెలిపారు.

టీడీపీ – జనసేన కలిసి పనిచేయడాన్ని ప్రజలు ముఖ్యంగా జన సైనికులు ఎవ్వరూ అంగీకరించడంలేదని చెప్పారు. టీడీపీ నేతలు కూడా జనసేన కార్యకర్తలను అవమానిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన – టీడీపీ విజయం సాధించే ప్రసక్తేలేదని, వాటికి ఓటమి తప్పదని అన్నారు. రాష్ట్రంలో­ని బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ఎన్నో ప­థ­కాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ మ­రో­సారి విజయం సాధించడం ఖాయమని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement