
ఏది నిజం?
నువ్వు నమ్మేది నిజమని నీకు చెప్పింది ఎవరు? అబద్ధం అనుకుంటున్నదాన్ని అబద్ధమని చెప్పింది ఎవరు?
నువ్వు నమ్మేది నిజమని నీకు చెప్పింది ఎవరు? అబద్ధం అనుకుంటున్నదాన్ని అబద్ధమని చెప్పింది ఎవరు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘అవసరానికో అబద్ధం’. చక్రం క్రియేషన్స్ పతాకంపై సురేశ్ కేవీ దర్శకత్వంలో జె.విజయ్, పులి శ్రీకాంత్, సందీప్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌గారు డైలాగ్స్ బాగున్నాయని చెప్పడం సంతోషంగా ఉంది. థ్రిల్లర్ సినిమా ఇది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంటుంది’’ అన్నారు. లోకేష్, రాజేష్, శశాంక్, గీతాంజలి, సందీప్, వెంకీ, గిరిధర్, మురళి, విజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: ఎస్. వెంకటరమణ, మ్యూజిక్: సాయికార్తీక్.