ఆలం సందీప్, ప్రమీల జంటగా సుమన్, కవిత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నువ్వు నేను ఒక్కటైతే’. బొంతు శ్రీనివాస్ దర్శకత్వంలో ఏవీ భాస్కర్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏవీ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టు విభిన్నమైన కథతో మంచి సినిమాని నిర్మించాం. మంచి సందేశాత్మక చిత్రం నిర్మించామని సెన్సార్ సభ్యులు చెప్పడం ఎంతో సంతోషాన్నిచ్చింది. థియేటర్స్ ప్రారంభం కాగానే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘విభిన్న కథా కథనాలతో తెరకెక్కిన చిత్రమిది. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో అనుకున్న సమయానికి పూర్తి చేశాం. నేను ఏది అడిగితే అది ఇచ్చి నాకు పూర్తి సహకారం ఇచ్చారు నిర్మాత. ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. ఈ చిత్రంలోని పాటలు సందర్భానికి తగ్గట్టు ఉంటాయి. త్వరలోనే మా సినిమా ట్రైలర్ విడుదల చేస్తాం’’ అని బొంతు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శూలం ప్రసాద్, సంగీతం: చిన్నికృష్ణ.
Comments
Please login to add a commentAdd a comment