prameela
-
నువ్వు నేను ఒక్కటైతే
ఆలం సందీప్, ప్రమీల జంటగా సుమన్, కవిత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నువ్వు నేను ఒక్కటైతే’. బొంతు శ్రీనివాస్ దర్శకత్వంలో ఏవీ భాస్కర్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏవీ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టు విభిన్నమైన కథతో మంచి సినిమాని నిర్మించాం. మంచి సందేశాత్మక చిత్రం నిర్మించామని సెన్సార్ సభ్యులు చెప్పడం ఎంతో సంతోషాన్నిచ్చింది. థియేటర్స్ ప్రారంభం కాగానే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘విభిన్న కథా కథనాలతో తెరకెక్కిన చిత్రమిది. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో అనుకున్న సమయానికి పూర్తి చేశాం. నేను ఏది అడిగితే అది ఇచ్చి నాకు పూర్తి సహకారం ఇచ్చారు నిర్మాత. ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. ఈ చిత్రంలోని పాటలు సందర్భానికి తగ్గట్టు ఉంటాయి. త్వరలోనే మా సినిమా ట్రైలర్ విడుదల చేస్తాం’’ అని బొంతు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శూలం ప్రసాద్, సంగీతం: చిన్నికృష్ణ. -
నేటి ట్రెండ్‌కి తగ్గ కథ
సుమన్, కవిత ప్రధాన పాత్రల్లో, అలం సందీప్, ప్రమీల జంటగా బొంతు శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఏవీ భాస్కర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఏవీ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘శ్రీనివాస్ చాలా క్లారిటీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు మంచిర్యాల, కోనసీమలో రెండు షెడ్యూల్స్ చిత్రీకరించాం. త్వరలో టైటిల్‌ను ప్రకటిస్తాం. జనవరి 24న ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. సుమన్, కవిత గార్లతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం బాగుంది’’ అన్నారు. ‘‘విభిన్న కథ, కథనాలతో నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రెండు షెడ్యూల్స్ పూర్తి చేశాం’’ అన్నారు బొంతు శ్రీనివాస్. ఈ చిత్రానికి కెమెరా: శూలం ప్రసాద్, సంగీతం: చిన్నికృష్ణ. -
పద్ధతి మారకపోతే కఠిన చర్యలు తప్పవు
వేముల : కస్తూర్బా పాఠశాలలో వర్గాలుగా ఏర్పడి విద్యార్థినుల చదువుతో ఆడుకోవద్దని, ఇకపై పద్ధతి మార్చుకుని బోధనపై దృష్టి పెట్టాలని గర్ల్ చైల్డ్ డెవెలప్మెంట్ ఆఫీసర్(జీసీడీవో) ప్రమీల ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం సాక్షి దిన పత్రికలో ’కస్తూర్బా పాఠశాల ఘటనలో తప్పెవరిది’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన ప్రమీల మంగళవారం పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయినులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సిబ్బందిలో లుకలుకలు కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలలో జరిగిన ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన నెలకొందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇకపై ఏ సంఘటనలు జరిగినా సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థినుల చదువుతో ఆటలాడితే ఉపేక్షించేది లేదని చెప్పారు. ఇన్చార్జి ఎస్‌వోగా హెప్సీబా : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఇన్చార్జి స్పెషలాఫీసర్‌గా హెప్సీబా నియమించినట్లు ప్రమీల తెలిపారు. పాఠశాలలో జరిగిన ఘటనతో ఇక్కడ ఎస్‌వోగా పనిచేస్తున్న ఉమాదేవిని విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దీంతో పాఠశాలలో ఇంగ్లీషు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న హెప్సీబాను ఇన్చార్జి ఎస్‌వోగా నియమిస్తూ ఎస్ఎస్ఏ పీవో వెంకటసుబ్బయ్య ఉత్తర్వులు జారీ చేశారని ఆమె తెలిపారు. -
ఒంటరి జీవితం వద్దనుకుని...
మనిషిని భయపెట్టే సంకేతాలు నాలుగు. అందులో ఒంటరి జీవితం ఒకటి. వైవాహిక జీవితంలో పిల్లలు కలగకపోగా, జీవితాంతం తోడూనీడగా ఉంటాడనుకున్న భర్త మరణించడంతో ఆమె ఒంటరిదైంది. కూలినాలీ చేసుకుంటూ నాలుగేళ్లుగా ఎలాగోలా నెట్టుకువచ్చిన ఆమె ఇక ఒంటరితనాన్ని భరించలేకపోయింది. జీవితంపై విరక్తి పెంచుకుంది. చివరకు బలవన్మరణానికి పాల్పడింది. చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన జయరాం భార్య ప్రమీల(32) బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుందని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ఆయన కథనం ప్రకారం... కొత్తచెరువుకు చెందిన ప్రమీల వివాహం బసంపల్లికి చెందిన జయరాంతో కొన్నేళ్ల కిందట అయింది. వారికి పిల్లలు లేరు. భర్త నాలుగేళ్ల కిందట అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి ఆమె కూలి పనులకు వెళ్లి వచ్చిన అరకొర డబ్బుతో కాలం గడిపేది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఇంట్లోనే ఆమె ఉరేసుకుని తనువు చాలించింది. బుధవారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఎస్ఐకు సమాచారం అందించారు. ఆయన తమ సిబ్బందితో కలసి గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, ఇరుగుపొరుగు వారిని విచారించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యాయత్నం కదిరి టౌన్ : కడుపునొప్పి తాళలేక తలుపులకు చెందిన ఓ యువకుడు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. చిన్నప్ప కుమారుడు కిరణ్‌బాబు అవివాహితుడు. అయితే కొన్నాళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. వైద్యం కోసం తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నొప్పి అధికం కావడంతో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి అపస్మార క స్థితికి చేరుకున్నాడు. ఇది గమనించిన కుటుంబీకులు వెంటనే వైద్యచికిత్సల నిమిత్తం కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
యోగాలో ప్రమీలకు స్వర్ణం
హైదరాబాద్: నగరానికి చెందిన జి.ప్రమీల రాష్ట్రస్థాయి యోగా చాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మెరిసింది. తెలంగాణ యోగా కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా భారతి సొసైటీ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ పోటీల్లో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. 40 ఏళ్లు పైబడిన వారికి నిర్వహించిన ఈవెంట్లో ఆమె బంగారు పతకం గెలుచుకుంది. రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమెకిది వరుసగా రెండో స్వర్ణం కాగా... గతంలో ఢిల్లీ, చెన్నై నగరాల్లో జరిగిన జాతీయ స్థాయి యోగా పోటీల్లో నాలుగో స్థానం పొందింది. -
కొడుకు మాట వినడం లేదని..
జోగిపేట: నగరంలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కొడుకు సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చి తిరిగి వెళ్లకపోవడంతో మనస్థాపం చెంది ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మెదక్ జిల్లా జోగిపేటలో బుధవారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న ఆకుల ప్రమీల(55) కుమారుడు నగరంలో చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన కొడుకు తిరిగి నగరానికి వెళ్లకపోవడంతో ఆగ్రహించిన ఆమె బుద్ధిగా వ్యాపారం చేసుకోమని పలుమార్లు చెప్పింది. అయినా కొడుకు వెళ్లకపోవడంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కేసీఆర్‌కు సూసైడ్ లేఖ రాసి..
శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి నమస్కరించి రాయునది ఏమనగా ! ఆర్యా ! నేను కె. ప్రమీల డాటర్ ఆఫ్ లక్ష్మయ్య. నాలాంటి ఎంతో మంది విద్యార్థుల మనస్సులో ఉన్న ఈ మాటని నేను మీకు చెప్పాలనుకుంటున్నా.. నేను ప్రస్తుతం ఎంఎస్సీ చేస్తున్నా. బీఈడీ కూడా అయిపోయి టెట్ కోసం చదువుతున్నా. నాది బీఈడీలో బయో సైన్స్ సబ్జెక్ట్. మాకు టెట్‌లో 30 మార్కులు మ్యాథ్స్ పెట్టడం వల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకోలేకపోతున్నాం. మాకు టెన్త్ వరకే మ్యాథ్స్ ఉంటుంది. తర్వాత ఎక్కడా మ్యాథ్స్ లేదు. టెట్‌లో మ్యాథ్స్ పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మ్యాథ్స్ ఉండటం వల్ల బయో సైన్స్ విద్యార్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. మ్యాథ్స్ తీసివేయాలని కోరుకుంటున్నాం. నాకు ఉపయోగపడకపోయినా నా తోటి విద్యార్థులకు ఉపయోగపడుతుంది. మ్యాథ్స్‌కు బదులు టెట్‌లో మెంటల్ ఎబిలిటి పెట్టమని కోరుతున్నా. ఇదే నా చివరి కోరికగా భావించి దీన్ని అమలు చేయాల్సిందిగా కోరుతున్నా. ఇట్లు తమ తెలంగాణ బిడ్డ ప్రమీల. దేవరకొండ(నల్లగొండ): ఓ విద్యార్థిని బతుకు పరీక్షలో ఓడిపోయింది. కన్నతండ్రి లేకపోయినా తన సొంత కష్టంతో చదివించిన తల్లి కోసం తాను కష్టపడి చదివింది. డిగ్రీలు పూర్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకుంది. ఉపాధ్యాయ ఉద్యోగ అర్హత పరీక్ష అయిన టెట్ గెలవలేక జీవితంతో రాజీపడలేక బలవన్మరణానికి యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తాను చనిపోయినా టెట్ ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఎలా ఆటంకంగా మారుతుందో ముఖ్యమంత్రికి వివరిస్తూ సూసైడ్ నోట్ రాసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన లక్ష్మయ్య, యాదమ్మల ఏకైక కుమార్తె ప్రమీల(25). లక్ష్మయ్య కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. దీంతో యాదమ్మ ఇంట్లోనే మిషన్ కుడుతూ ప్రమీలకు కష్టపడి చదువు చెప్పించింది. తల్లి కష్టాన్ని కళ్లారా చూస్తున్న ప్రమీల ఆమెకు తోడుగా నిలవాలనుకుంది. అందుకు కష్టపడి చదివింది. ఇంటర్లో బైపీసీ చేసిన తర్వాత డిగ్రీ, ఎంఎస్సీ కూడా పూర్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రమీల బీఈడీ కూడా పూర్తి చేసింది. టీచర్ ఉద్యోగం కోసం ప్రమీల టెట్‌కు ప్రిపేర్ అవుతోంది. టెట్‌లో అన్ని సబ్జెక్టుల వారికి కామన్ సిలబస్‌గా మ్యాథ్స్ కూడా చేర్చడంతో పదోతరగతి వరకే మ్యాథ్స్ చదివిన ప్రమీల ఆ సబ్జెక్టులో పట్టులేకపోవడంతో చదువును భారంగా భావించింది. ముఖ్యమంత్రికి టెట్ విధానంపై బయో సైన్స్ విద్యర్ధులకు కష్టతరమవుతున్న తీరును సూసైడ్ నోట్లో రాసింది. గత శుక్రవారం ఇంట్లో ఉన్న ప్రమీల సూపర్ వాస్మాల్ 33 కేశ్‌కాలా తాగింది ఆత్మహత్యాయత్నం చేయగా గమనించిన తల్లి యాదమ్మ ,ఇరుగుపొరుగు వాళ్లు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమీల సోమవారం మృతి చెందింది. -
కేన్సర్‌ను జయించిన ప్రమీళా
-
అర్హులకు ఇవ్వరా?
కొండపాక, న్యూస్‌లైన్: ఎన్నో ఏళ్లుగా ఇంటి స్థలాలిస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే పేద ప్రజలకు ఇవ్వకుండా అనర్హులకు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల వారికి ఇవ్వడంపై మండలంలోని కుకునూర్‌పల్లి మహిళలు, పేదలు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని కుకునూర్‌పల్లిలో శుక్రవారం గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పా ల్గొనడానికి తహశీల్దార్ప్రమీల, మండల ఈఓఆర్డీ సుబ్రహ్మణ్యమూర్తి, ఏఓ భోగేశ్వర్ తదితర అధికారులు గ్రామానికి చేరుకున్నారు. కార్యాలయంలో అధికారులు గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహిస్తుండగా అక్కడికి చేరుకున్న మహిళలు, గ్రామస్థులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎక్కడో రాజస్తాన్ నుం డి ఏడాది కిందట వచ్చిన స్వీట్‌హోమ్ వ్యాపారికి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఏ లెక్కన ఇచ్చారని నిలదీశారు. వరంగల్ జిల్లాకు చెందిన ఒక చిరువ్యాపారి ఆరు నెలల కిందట గ్రామానికి వలస రాగా అతనికి కూడా ప్లాటు ఏ ప్రాతిపదికన కేటాయించారని ప్రశ్నించారు. అర్హులైన పేద లు దశాబ్దానికి పైగా ఎదురు చూస్తుం డగా స్థానికేతరులకు ఇచ్చారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పంచిన పట్టా సర్టిఫికెట్లను అధికారులు వెంటనే వెనక్కి తీసుకొని అర్హులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్థుల ఆందోళనకు కొండపాక మాజీ జడ్పీటీసీ సభ్యుడు తూం అంజిరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా గ్రామస్థులు మాట్లాడుతూ దశాబ్దం కింద పేదల ఇళ్లస్థలాల కోసం ప్రభుత్వం చాకలి నారాయణ అనే వ్యక్తి దగ్గర 662, 783 సర్వేనెంబర్లలోని ఒకటిన్నర ఎకరాల భూమి ని కొనుగోలు చేసిందన్నారు. పేదలు చాలా మంది ఇళ్లస్థలాల కోసం గతంలోనే అర్జీలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారన్నారు. కాగా ప్రభుత్వం సేకరించి న భూమిని గ్రామానికి చెందిన ఒకరిద్దరు కలిసి ఇష్టారీతిగా పంచిపెట్టారని ఆరోపించారు. దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొ ని అర్హులకు న్యాయం చేయాలని డిమాం డ్ చేశారు. లేకుంటే అక్కడ జరిపే నిర్మాణాలను మహిళలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనికి తహశీల్దార్ ప్రమీల స్పందిస్తూ తాను క్తొతగా వచ్చాననీ, విషయాన్ని పూర్తిగా పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తానని తెలిపారు. -
మృతుల్లో వరంగల్ జిల్లావాసి
బచ్చన్నపేట, న్యూస్‌లైన్: మల్కనగిరి అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన జిలానీబేగం అలియాస్ ప్రమీల (40) రెండు దశాబ్దాలుగా మావోయిస్టు విప్లవోద్యమంలో పనిచేస్తోంది. ప్రస్తుతం ఏవోబీ స్పెషల్ జోనల్ డివిజన్ కమిటీ సభ్యురాలిగా, పాడియా డివిజన్ కార్యదర్శిగా ఉన్న ఆమెపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన నిలిగొండ ప్రమీల 1994లో నర్మెట రాధక్క దళ సభ్యురాలిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. అనంతరం నర్సంపేట, ఏటూరునాగారం దళాల సభ్యురాలిగా పనిచేసింది. అప్పుడే గాజర్ల రవి అలియాస్ గణేష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. 2002లో ఏటూరునాగారం డిప్యూటీ దళ కమాండర్‌గా, అక్కడే ఎల్జీఎస్ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టింది. 2005 ఫిబ్రవరి 7న కరీంనగర్ జిల్లా కాటారంలో ప్రమీలను పోలీసులు అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు పంపించారు. 2006 మార్చి15న బెయిల్‌పై విడుదలై, పోచ్చన్నపేటలో నెల రోజులున్న ప్రమీల తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. మూడుసార్లు అరెస్ట్ అయిన ఆమెపై కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మొత్తం 33 కేసులు నమోదయ్యాయి.