కవిత, సుమన్
సుమన్, కవిత ప్రధాన పాత్రల్లో, అలం సందీప్, ప్రమీల జంటగా బొంతు శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఏవీ భాస్కర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఏవీ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘శ్రీనివాస్ చాలా క్లారిటీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు మంచిర్యాల, కోనసీమలో రెండు షెడ్యూల్స్ చిత్రీకరించాం. త్వరలో టైటిల్‌ను ప్రకటిస్తాం. జనవరి 24న ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. సుమన్, కవిత గార్లతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం బాగుంది’’ అన్నారు. ‘‘విభిన్న కథ, కథనాలతో నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రెండు షెడ్యూల్స్ పూర్తి చేశాం’’ అన్నారు బొంతు శ్రీనివాస్. ఈ చిత్రానికి కెమెరా: శూలం ప్రసాద్, సంగీతం: చిన్నికృష్ణ.
Comments
Please login to add a commentAdd a comment