బిగ్‌బాస్‌ ఫేమ్‌ సందీప్‌ హీరోగా ‘షార్ట్‌ కట్‌’ | Bigg Boss 7 Telugu Fame Sandeep New Movie Titles As ShortCut, Deets Inside - Sakshi
Sakshi News home page

Aata Sandeep ShortCut Movie: బిగ్‌బాస్‌ ఫేమ్‌ సందీప్‌ హీరోగా ‘షార్ట్‌ కట్‌’

Published Wed, Jan 10 2024 11:24 AM | Last Updated on Wed, Jan 10 2024 11:38 AM

Bigg Boss Fame Sandeep New Movie Titles As ShortCut - Sakshi

కొరియోగ్రాఫర్‌ ‘ఆట’ సందీప్‌ హీరోగా నటించిన చిత్రం ‘షార్ట్‌ కట్‌’. విజయానికి అడ్డదారులుండవు అనేది ట్యాగ్‌లైన్‌. రామకృష్ణ కంచి దర్శకత్వంలో షర్మిల కంచి సమర్పణలో తోట రంగారావు, పున్నపు రజనీకాంత్‌ నిర్మించారు. హైదరాబాద్‌లో ఈ చిత్రం పోస్టర్‌ విడుదల, షో రీల్‌ వేడుక జరిగింది. రామకృష్ణ కంచి మాట్లాడుతూ– ‘‘25 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉంటూ చాలా శాఖల్లో పని చేశాను. ఆ అనుభవంతో ‘షార్ట్‌ కట్‌’ తీశా. ప్రస్తుతం యువత డ్రగ్స్‌కు అలవాటుపడి తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు? ఈ దందా వెనక జరుగుతున్న చీకటి కోణాలు ఏంటి? అనేది ఈ చిత్రంలో చూపించాం’’ అన్నారు.

‘‘డార్క్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది’’ అన్నారు ‘ఆట’ సందీప్‌. ‘‘ఈ సినిమాను కేవలం డబ్బు కోసమే కాకుండా సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని నిర్మించాం’’ అన్నారు తోట రంగారావు. ‘ నామీద మీరు చూపించే అభిమానం సందీప్‌ అన్న సినిమా ‘షార్ట్‌ కట్‌’పై కూడా చూపించాలని కోరుకుంటున్నాను’  అన్నారు ‘బిగ్‌ బాస్‌ 7’ విజేత పల్లవి ప్రశాంత్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement