short cut
-
బిగ్‌బాస్ ఫేమ్ సందీప్ హీరోగా ‘షార్ట్ కట్’
కొరియోగ్రాఫర్ ‘ఆట’ సందీప్ హీరోగా నటించిన చిత్రం ‘షార్ట్ కట్’. విజయానికి అడ్డదారులుండవు అనేది ట్యాగ్‌లైన్. రామకృష్ణ కంచి దర్శకత్వంలో షర్మిల కంచి సమర్పణలో తోట రంగారావు, పున్నపు రజనీకాంత్ నిర్మించారు. హైదరాబాద్‌లో ఈ చిత్రం పోస్టర్ విడుదల, షో రీల్ వేడుక జరిగింది. రామకృష్ణ కంచి మాట్లాడుతూ– ‘‘25 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉంటూ చాలా శాఖల్లో పని చేశాను. ఆ అనుభవంతో ‘షార్ట్ కట్’ తీశా. ప్రస్తుతం యువత డ్రగ్స్‌కు అలవాటుపడి తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు? ఈ దందా వెనక జరుగుతున్న చీకటి కోణాలు ఏంటి? అనేది ఈ చిత్రంలో చూపించాం’’ అన్నారు. ‘‘డార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది’’ అన్నారు ‘ఆట’ సందీప్. ‘‘ఈ సినిమాను కేవలం డబ్బు కోసమే కాకుండా సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని నిర్మించాం’’ అన్నారు తోట రంగారావు. ‘ నామీద మీరు చూపించే అభిమానం సందీప్ అన్న సినిమా ‘షార్ట్ కట్’పై కూడా చూపించాలని కోరుకుంటున్నాను’ అన్నారు ‘బిగ్ బాస్ 7’ విజేత పల్లవి ప్రశాంత్. -
హీరోగా బిగ్‌బాస్ కంటెస్టెంట్.. పాటతో కుమ్మేసిన భోలె!
ఆట సందీప్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్లో కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్ సీజన్లో విజేతగా నిలిచి ఫేమస్ అయ్యారు. అప్పటినుంచి ఆయన పేరు ఆట సందీప్‌గా మారిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్ కూడా మంచి డ్యాన్సరే కావడం విశేషం. అంతే కాకుండా గతేడాది జరిగిన బిగ్‌బాస్ రియాలిటీ షో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. చాలా వారాల పాటు హౌస్‌లోనూ తన ఆటతీరుతో మెప్పించారు. అయితే ప్రస్తుతం ఆట సందీప్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ది షార్ట్‌కట్ అనే చిత్రంలో ఆయన నటిస్తున్నారు. విజయానికి అడ్డదారులువండవు అనేది ఈ మూవీకి క్యాప్షన్. ఈ చిత్రాన్ని రామకృష్ణ కంచి దర్శకత్వంలో తోట రంగారావు, రజినీకాంత్ పున్నపు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్లో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ పాల్గొన్ని సందడి చేశారు. ఈవెంట్‌కు హాజరైన వారిలో భోలె షావలి, టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, శివాజీ, అశ్విని, గౌతమ్ ఉన్నారు. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
షార్ట్‌కట్‌లో ఓట్లు సంపాదించటం సులభమే.. కానీ: మోదీ
రాంచీ: షార్ట్‌కట్‌లో ఓట్లు సంపాదించడం సులభమే కానీ, ఆ తరహా రాజకీయాలు దేశాన్నే నాశనం చేస్తాయని హెచ్చరించారు ప్రధాని నరేంద్ర మోదీ. షార్ట్‌కట్ రాజకీయాలకు పాల్పడేవారు ఎప్పటికీ కొత్త విమానాశ్రయాలు, రహదారులు, ఎయిమ్స్‌లు నిర్మించలేరని విపక్షాలపై పరోక్ష విమర్శలు చేశారు. ఝార్ఖండ్‌లోని దేవఘర్లో సుమారు రూ.16,800 కోట్లతో చేపట్టిన నూతన విమానాశ్రయం, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు మోదీ. అనంతరం దేవఘర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు మోదీ. 'షార్ట్‌కట్ రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తాయి. ప్రస్తుతం ఈ షార్ట్‌కట్ రాజకీయాలు దేశానికి అతిపెద్ద సమస్యగా మారాయి. అలా ఓట్లు సులభంగా సాధించవచ్చు. ఒక దేశంలోని రాజకీయాలు షార్ట్‌కట్‌పై ఆధారపడితే.. అది షార్ట్ సర్క్యూట్‌కు దారి తీస్తుంది. అలాంటి రాజకీయాలకు దూరంగా ఉండాలని దేశ ప్రజలను కోరుతున్నా. అలా షార్ట్‌కట్ రాజకీయాలకు పాల్పడేవారు దేశాభివృద్ధి కోసం పనిచేయలేరు.' అని పేర్కొన్నారు మోదీ. దేవఘర్లో విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు తనకు అవకాశం లభించిందని, ఈరోజు అదే ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందన్నారు మోదీ. గతంలో ప్రాజెక్టులు ప్రకటించటం.. 2-3 ప్రభుత్వాలు మారాక శంకుస్థాపన చేయటం జరిగేదన్నారు. అలా కొన్ని ప్రభుత్వాలు మారాకే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవని విమర్శలు గుప్పించారు. భారత్ భక్తి, ఆధ్యాత్మికత, పుణ్యక్షేత్రాలకు నిలయమని పేర్కొన్నారు. తీర్థయాత్రలు మనల్ని మెరుగైన సమాజంగా, మంచి దేశంగా తీర్చిదిద్దుతాయన్నారు. దేవఘర్లో జ్యోతిర్లింగంతో పాటు మహాశక్తి పీఠం ఉందని గుర్తు చేశారు. ప్రతి ఏటా లక్షల మంది భక్తులు దేవఘర్‌కు వచ్చి మహాశివుడిని దర్శించుకుంటారని తెలిపారు. ఇదీ చూడండి: దిల్లీ- ముంబైల మధ్య 'ఎలక్ట్రిక్ హైవే'.. దేశంలోనే తొలిసారి! -
‘విజయానికి షార్ట్‌కట్స్ ఉండవు’
ముంబై: భారత క్రికెట్లో సచిన్ సమున్నత శిఖరం. ఈ దిగ్గజానికి తండ్రి సందేశమే మార్గనిర్దేశమైంది. సచిన్ తండ్రి రమేశ్ టెండూల్కర్.. ఎంచుకున్న రంగంలో విజయవంతమయ్యేందుకు కష్టపడాలి తప్ప దగ్గరిదారులు (షార్ట్‌కట్స్) అంటూ ఉండవని సందేశమిచ్చారు. ఇప్పుడిదే సందేశాన్ని సచిన్... తన తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు ఇచ్చినట్లు చెప్పాడు. లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్జున్ ఇటీవలే ముగిసిన టీ20 ముంబై లీగ్‌లో ఆకాశ్ టైగర్స్ ముంబై వెస్టర్న్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రూ.5 లక్షలకు టైగర్స్ ఫ్రాంచైజీ అతన్ని కొనుక్కుంది. ఈ జట్టు సెమీస్ దాకా పోరాడగా... అర్జున్ బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నాడు. దీనిపై సచిన్‌ను సంప్రదించగా ‘అర్జున్‌కు క్రికెట్‌ను బలవంతంగా రుద్దలేదు. స్వతహాగానే అతనికి ఆటంటే ఆమితాసక్తి. నిజానికి మావాడు ఫుట్‌బాల్ ఆడేవాడు. తర్వాత చెస్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. ఇప్పుడేమో శ్రద్దగా క్రికెట్ ఆడుతున్నాడు. అయితే నేను చెప్పిందొక్కటే... జీవితంలో ఏది ఎంచుకున్నా అందుల్లో షార్ట్‌కట్స్ వెతక్కూడదు. విజయం సాధించేందుకు కష్టపడటం ఒక్కటే మార్గం. ఈ విషయాన్ని నా తండ్రి నాకు చెప్పాడు. నేను మావాడికి చెప్పా’ అని అన్నాడు. అందరి తల్లిదండ్రుల్లాగే తను కూడా తన కుమారుడు బాగా ఆడాలని కోరుకున్నట్లు చెప్పాడు. ఆటలో అయినా ఇంకేదైనా మన ప్రయత్నం మనం చేయాలని, కఠోరంగా శ్రమించాలని ఫలితం దేవుడి చేతుల్లో ఉంటుందని ‘మాస్టర్ బ్లాస్టర్’ అన్నాడు. -
షార్ట్ కట్
-
దగ్గర దారే మృత్యుమార్గం అయ్యింది!!
చిన్నారుల ప్రాణాలను కర్కశంగా తీసుకెళ్లిపోయిన ప్రమాదం జరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. దగ్గర దారి అనుకుని కాపలా లేని రైల్వే క్రాసింగ్ మీదుగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం సంభవించింది. బస్సుకు రోజూ వచ్చే డ్రైవర్ రాకపోవడంతో.. మరో డ్రైవర్‌ను పిలిపించారు. మాసాయిపేట వద్ద మొత్తం మూడు రైల్వే లెవెల్ క్రాసింగులు ఉన్నాయి. వాటిలో రెండింటికి గేట్లు, కాపలా కూడా ఉన్నాయి. ఈ రెండింటినీ కాదని, గేటు ఉండదన్న ఉద్దేశంతోనే మూడో క్రాసింగ్ మీదుగా వెళ్లాడని, అందుకే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. మొత్తం మూడు క్రాసింగులకు మధ్య దూరం కూడా కేవలం ఒకటిన్నర కిలోమీటర్లు మాత్రమేనని దక్షిణమధ్య రైల్వే సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కాపలా ఉన్న గేట్లు అయితే ఆగాల్సి వస్తుందని, గేటు లేనిచోట అయితే నేరుగా వెళ్లిపోవచ్చని డ్రైవర్ భావించడమే ఈ పెను ప్రమాదానికి కారణమైంది. 14 మంది చిన్నారులను కర్కశంగా చిదిమేసింది. సెల్‌ఫోనులో మాట్లాడుతూ.. బస్సు డ్రైవర్ సెల్‌ఫోనులో మాట్లాడుతుండటం వల్లే అతడు రైలు వస్తున్న విషయాన్ని గుర్తించలేదని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చిట్టచివరి నిమిషంలో వెనుక నుంచి పిల్లలంతా రైలు.. రైలు అని అరవడంతో ఒక్కసారి కంగారుపడి ఆలస్యంగా బ్రేకులు వేశాడని, కానీ.. దానివల్ల బస్సు ఆగకపోగా రైలు పట్టాల మీదుగా జారిపోవడంతో వేగంగా వస్తున్న రైలు ఢీకొందని అంటున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)