
రైతుబిడ్డ తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదంటున్నాడు పల్లవి ప్రశాంత్.. ఒక్క ఛాన్స్ అంటూ బిగ్‌బాస్ స్టూడియో ముందు పడిగాపులు కాసిన ప్రశాంత్ ఏడో సీజన్‌లో పాల్గొనడమే కాకుండా ఆ సీజన్‌కు విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే! అయితే షో అయిపోయిన తర్వాత చేసిన హంగామా వల్ల జైలుకు కూడా వెళ్లివచ్చాడు. తాజాగా ఇతడు బిగ్‌బాస్ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ హీరోగా నటించిన ఓ సినిమా ఈవెంట్‌కు హాజరయ్యాడు.
దేవుడే దిక్కు
ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. 'మనల్ని మనం నమ్ముకోవాలి. అలాగే దేవుడిని నమ్మినవాళ్లు ఎప్పుడూ చెడిపోరు. ఆ భగవంతుడే కాపాడతాడు. ఏ కష్టంలో ఉన్నా దేవుడే దిక్కనుకుంటే ఆయనే ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడతాడు. మన వెన్నంటే ఉంటాడు. మనం ముందుకు వెళ్తుంటే ఎన్నో దెబ్బలు తాకుతూ ఉంటాయి. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా సరే గట్టిగా నిలబడాలి. నేను అలాగే నిలబడ్డాను.. అందుకే మీముందు ఇలా నిలబడ్డాను.
మీ ఆశీస్సులు ఉంటే..
ఇంకా ఎన్ని ఎదురుదెబ్బలు తాకినా సరే అస్సలు భయపడను, వెనక్కు వెళ్లను.. ఇలాగే నిలబడతాను. రైతుబిడ్డ అనుకుంటే ఏదైనా సాధిస్తాడు' అని చెప్పాడు. ఇంతలో శివాజీ పార్లమెంటుకు కూడా వెళ్తాడు అనగా.. 'మీ అందరి ఆశీస్సులు ఉంటే అది కూడా జరుగుతుంది. యువత మేలుకోవాలి, యువత ముందడుగు వేయాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది' అని చెప్పుకొచ్చాడు. ప్రశాంత్ మాటల్ని బట్టి చూస్తే జనాలు సపోర్ట్ చేస్తే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.
చదవండి: బిగ్‌బాస్ విన్నర్ ఓవరాక్షన్.. యూట్యూబర్‌ను కాలితో తన్నుతూ, కొడుతూ..
Comments
Please login to add a commentAdd a comment