నచ్చిన అంకెలతో మొబైల్ ఫోన్ నంబర్ | Tata Docomo allows subscribers to create own phone numbers | Sakshi
Sakshi News home page

నచ్చిన అంకెలతో మొబైల్ ఫోన్ నంబర్

Published Tue, Dec 23 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM

నచ్చిన అంకెలతో మొబైల్ ఫోన్ నంబర్

నచ్చిన అంకెలతో మొబైల్ ఫోన్ నంబర్

టాటా డొకొమో ఆఫర్

న్యూఢిల్లీ: టాటా డొకొమో వినియోగదారులు తమకు ఇష్టం వచ్చిన అంకెలతో సొంతంగా మొబైల్ ఫోన్ నంబర్‌ను సృష్టించుకోవచ్చు. తమ పుట్టిన రోజు తేదీలతో కానీ, లేదా తమకు ఇష్టమైన అంకెలతో, లేదా తేలికగా గుర్తించుకునేలా నచ్చిన అంకెలతో మొబైల్ ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని టాటా టెలీ సర్వీసెస్ హెడ్(బ్రాండెడ్ రిటైల్, స్ట్రాటజిక్ డిస్ట్రిబ్యూషన్)సందీప్ సింఘాల్ తెలిపారు.

వినియోగదారులు ఏ టాటా డొకొమో బ్రాండ్ స్టోర్స్‌లోకి వెళ్లినా, ఇలాంటి మొబైల్ నంబర్ పొందవచ్చని వివరించారు. కొత్త వినియోగదారులకే కాక ప్రస్తుత కస్టమర్లకూ ఇది వర్తిస్తుందన్నారు.  ఈ తరహా సేవలందించడం మొబైల్ ఫోన్ల పరిశ్రమలో ఇదే మొదటిసారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement