టీమిండియా క్రికెటర్‌కు లక్కీ ఛాన్స్‌.. ఏకంగా షమీ స్ధానంలోనే? | Sandeep Warrier Replaces Mohammed Shami At Gujarat Titans | Sakshi
Sakshi News home page

IPL 2024: ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడాడు.. భారత క్రికెటర్‌కు లక్కీ ఛాన్స్‌ ! ఏకంగా షమీ స్ధానంలో

Published Thu, Mar 21 2024 8:23 AM | Last Updated on Thu, Mar 21 2024 8:43 AM

 Sandeep Warrier as Replaces Mohammed Shami At Gujarat Titans - Sakshi

ఐపీఎల్‌-2024 సీజన్‌కు గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. షమీ ఇటీవలే తన చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. షమీ ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో షమీ స్ధానాన్ని తమిళనాడు పేసర్‌ సందీప్‌ వారియర్‌తో గుజరాత్‌ టైటాన్స్‌ భర్తీ చేసింది.

ఈ విషయాన్ని ఐపీఎల్ పాలక మండలి ఓ ప్రకటనలో ధ్రువీకరించింది. సందీప్‌ను కనీస ధర రూ.50 లక్షలకు గుజరాత్‌ టైటాన్స్‌ దక్కించుకుంది. సందీప్ వారియర్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున 2019 - 2021 మధ్య 5 మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఐదు మ్యాచ్‌ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

కాగా వారియర్‌ టీమిండియా తరపున కేవలం ఒక్క టీ20 మ్యాచ్‌ ఆడాడు. 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌తో వారియర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో వారియర్‌ విఫలమకావడంతో తర్వాత సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఐపీఎల్‌-2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement