ఆకట్టుకునే మిత్రబృందం... | Friend Troop which attracts | Sakshi
Sakshi News home page

ఆకట్టుకునే మిత్రబృందం...

Published Tue, Apr 22 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM

ఆకట్టుకునే మిత్రబృందం...

ఆకట్టుకునే మిత్రబృందం...

‘‘ఈ చిత్ర దర్శకుడు జీఎస్‌రావు మా సంస్థలో చాలా చిత్రాలకు రచన చేశారు. ఆయనను నేనే దర్శకునిగా పరిచయం చేయాలనుకున్నాను. కుదర్లేదు. ఈ చిత్రాన్ని తను అద్భుతంగా తీసి ఉంటాడనుకుంటున్నాను’’ అని నిర్మాత డి.సురేశ్‌బాబు అన్నారు. సందీప్, సిద్దార్థ్ వర్మ, హరీశ్, రవి, అంజనా దేశ్‌పాండే, విష్ణుప్రియ, హారిక, కృతిక ముఖ్యతారలుగా జీఎస్ రావు దర్శకత్వంలో ‘సాయిమేధ’ రమణ, ఓరుగంటి మధుసూదన్ నిర్మించిన ‘నేనూ నా ఫ్రెండ్స్’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని సురేశ్‌బాబు ఆవిష్కరించారు.
 
 ఈ సందర్భంగా హరీశ్‌శంకర్ మాట్లాడుతూ- ‘‘మేమంతా ఒకేసారి కెరీర్ మొదలుపెట్టాం. జీఎస్‌రావు లేట్ అయినా లేటెస్ట్‌గా ఈ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు’’ అన్నారు. ఈ రోజు తానీ స్థితిలో ఉండటానికి సురేశ్‌బాబు కారణమని జీఎస్‌రావు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సినిమాలో మిత్రబృందం చేసే పనులు అందర్నీ ఆకట్టుకుంటాయని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ వేడుకలో పరుచూరి బ్రదర్స్, వీరశంకర్, దశరథ్, దేవిప్రసాద్, ‘కత్తి’ఫేం మల్లికార్జున, ఎగ్జిక్యూటివ్ నిర్మాత  వై.విజయభాస్కరరెడ్డి, సహ నిర్మాతలు సామీ చాగూర్ రవి, నందం కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement