విజయనగరంలో ‘వెంకీ’
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: విద్యలనగరమైన విజయనగరంలో సినీ నటుడు విక్టరీ వెంకటేష్ సోమవారం ఒక్కసారిగా హడావుడి చేశారు. పట్టణంలోని ప్రధాన కూడలి గంటస్తంభం ప్రాంతంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో సురేష్ ప్రొడక్షన్స్ వాహనం కనబడగానే ప్రజలంతా గుమిగూడారు. ఇంతలోనే తమ అభిమాన హీరో విక్టరీ వెంకటేష్ కనబడగానే జనం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మరోసారి వాహనంలోంచి బయటకు వచ్చి పలకరిస్తారనే ఉద్దేశం తో పట్టణంలోని వెంకటేష్ ఫ్యాన్స్, అధిక సంఖ్యలో మహిళలతో గంటస్తంభం ప్రాంతం నిండిపోయింది.
అరగంట అనంతరం బయటకు వచ్చిన వెంకటేష్ అభిమానులకు తనదై న స్టైల్‌లో చేయి ఊపుతూ, అప్యాయంగా పలకరిస్తూ అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో వెళ్లిపోయారు. మళయాల చిత్రం రీమేక్‌కి సంబంధించి అరుకు తదితర ప్రాంతాల్లో షూటింగ్ నిమిత్తం ఆయన వచ్చినట్లు తెలిసింది. అనంతరం ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత సురేష్‌బాబుతో కలిసి సాయంత్రం కోట జంక్షన్, మూడు లాంతర్లు తదితర ప్రాంతాల్లో సందడి చేశారు. విజయనగ రం ఇలవేల్పు పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. విక్టరీ వెంకటేష్ రాకతో అభిమానులు ఆనంద పరవశులయ్యారు.
తాటిపూడిలో సినిమా సందడి
గంట్యాడ : సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మలయాళం రీమేక్ సినిమా సన్నివేశాలను హీరో వెంకటేష్‌పై తాటిపూడి ఇరిగేషన్ కాలు వ గట్టు వద్ద సోమవారం చిత్రీకరించారు. డెరైక్టర్ శ్రీప్రియ, అసిస్టెంట్ డెరైక్టర్‌ల పర్యవేక్షణలో స్ల్పెండర్ ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్లే సన్నివేశాన్ని చిత్రీకరించారు.ఈ సందర్భంగా నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ ఈ చిత్రం మళయాళంలో ప్రేక్షకుల ఆదరణ పొందిందన్నారు. మంచి కుటుంబ కథాచిత్ర మన్నారు. చిత్రంలో మీనా, నదియాలు నటించనున్నారని చెప్పారు. చిత్రానికి పేరు ఇంకా పెట్టలేదన్నారు. ఇంతవరకు విజయనగరం, విశాఖపట్నం, అరుకు తదితర ప్రాంతాలలో పలు సన్నివేశాలు చిత్రీకరించామని చెప్పారు. వెంకటేష్‌ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.