Venkatesh Drishyam 2 First Look Poster Delayed - Sakshi
Sakshi News home page

Drishyam: ‘దృశ్యం 2’ సినిమా ఫస్ట్‌లుక్‌ వాయిదా

Published Mon, Sep 20 2021 1:03 PM | Last Updated on Mon, Sep 20 2021 3:03 PM

Drishyam 2 First look delays Due to Unforeseen Circumstances - Sakshi

మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా నటించిన ‘దృశ్యం’ మూవీని అదే పేరుతో తెలుగులో రీమేక్‌ చేసి వెంకటేష్‌ సూపర్‌ హిట్‌ అందుకున్న విషయం తెలిసిందే. జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ మలయాళీ సినిమాకి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’  ఓటీటీలో విడుదలై  భారీ విజయాన్ని అందుకుంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో వెంకీ రీమేక్‌  చేస్తున్నాడు. దీనికి సైతం జీతూనే డెరెక్షన్‌ చేయనున్నాడు.

కాగా వెంకీ ‘దృశ్యం 2’ ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ని సోమవారం (సెప్టెంబర్‌ 20న) ఉదయం 10.08గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం మూవీ టీం ప్రకటించింది. కానీ అనుకోని కారణాల వల్ల విడుదల చేయలేదు. ఈ విషయంపై సోషల్‌ మీడియాలో స్పందించిన మేకర్స్‌ అనివార్య కారణాల వల్ల సినిమా ఫస్ట్‌ లుక్‌ వాయిదా వేస్తున్నామని, అసౌకర్యానికి క్షమాపణలు అని తెలిపారు. అయితే మలయాళం మోహన్‌లాల్‌కి జోడిగా నటించిన మీనా ఈ చిత్రంలోనూ వెంకీతో జతకడుతోంది. కాగా ‘దృశ్యం 2’ మూవీని దసరా కానుకగా విడుదల చేయడానికి చిత్రబృందం ప్లానింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: దసరాకే ‘దృశ్యం 2’, విడుదల తేదీ ఎప్పుడంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement