పెళ్లి చూపులు సక్సెస్‌తో తరుణ్ భాస్కర్ డైరెక్టర్‌గా సక్సెస్ సాధించారు. సురేష్ ప్రొడక్షన్స్ తెరకెక్కించిన ఈ సినిమా ఘన విజయాన్ని నమోదు చేసింది. తన రెండో సినిమాను కూడా ఇదే బ్యానర్‌లో తెరకెక్కించారు తరుణ్ భాస్కర్. ఈ నగరానికి ఏమైంది? అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యారు.
జూన్ 29న రాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం ఘనంగా నిర్వహించారు. కేటీఆర్, రానా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో.. చిత్రబృందం సినిమా గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. తరుణ్ భాస్కర్ తరువాతి మూవీ కూడా ఇదే బ్యానర్‌లో ఉండబోతోందని, ఆ సినిమాలో రానా హీరోగా నటించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment