
జీవన్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం
తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం ప్రధాన పాత్రధారులుగా షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ, వర్థన్ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ‘ఎవ్రీ ఫోన్ హ్యాజ్ ఇట్స్ సీక్రెట్స్’ అనేది ట్యాగ్‌లైన్. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘మీ లాంటి వారు బ్రౌజర్ హిస్టరీ డిలిట్ చేస్తారు. కాల్ హిస్టరీ డిలిట్ చేస్తారు. వాట్సప్ చాట్ డిలిట్ చేస్తారు.
అన్నీ దాచేసి దొరికిపోతే చీటింగ్ కాదంటారు’, ‘ప్లీజ్ నా గురించి తప్పుగా ఆలోచించొద్దురా.. బేసిక్‌గా నేను మంచోణ్ణి’ అన్న టీజర్‌లోని డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబరులో విడుదల చేయాలనుకుంటున్నారు. అనసూయ భరద్వాజ్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అంతిక మిశ్రా, వినయ్, జీవన్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు శివ కుమార్ దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment